తమిళ ఆర్ఎక్స్ 100 లో హీరో ఇతనే..!
ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ ని అందుకున్న ఆర్ ఎక్స్ 100 చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో వేరే చెప్పవసరం లేదు. ఈ సినిమాకు పని చేసిన వారి దగ్గర నుండి నటించిన వారి దాకా అందరి జీవితాలు ఈ ఒక్క సినిమాతో మారిపోయాయి. ముఖ్యంగా ఆర్ఎక్స్ 100 దర్శకుడికి బాలీవుడ్ నుండి ఆఫర్ రావడమే కాదు అతను ప్రేమించిన అమ్మాయిని ఈనెల 25 న పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నారు.
అక్కడే ఆమే హీరోయిన్
మరి ఇందులో ఎవరు హీరో ? రంగస్థలంలో మనల్ని ఏడిపించేసి అందరి మనసులు గెలుచుకున్న రామ్ చరణ్ అన్నయ్య కుమార్ బాబు ( ఆది పినిశెట్టి ) హీరోగా కన్ఫర్మ్ అయ్యాడు. మరి ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. ఇక హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ నే ఓకే చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాకపోతే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళటానికి చాలా సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే హీరో పాత్రకు కావాల్సిన రఫ్ లుక్ కోసం గెడ్డం పెంచడంతో పాటు కొన్ని వర్క్ ఔట్స్ కూడా ఆది పినిశెట్టి చేయబోతున్నాడు.
మళ్లీ హీరో అయ్యేందుకు గట్టి ప్రయత్నాలు
తమిళంలో కూడా ఆర్ఎక్స్ 100 అనే టైటిల్ పెడుతున్నారు. ఎందుకంటే ఆ బైక్ కి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది కాబట్టి కథకు ప్రేక్షకులు కూడా త్వరగా కనెక్ట్ అవుతారు కాబట్టి ఈ టైటిల్ ను పెడుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆది నటించిన 'నీవెవరో' 24న విడుదల కానుండగా సమంతతో చేసిన 'యుటర్న్' సెప్టెంబర్ రెండో వారం లో విడుదల అవుతుంది. మొత్తానికి ఆది మళ్లి హీరోగా మారేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.