Fri Mar 29 2024 13:35:32 GMT+0000 (Coordinated Universal Time)
చైన్నైలో జరిగిన యధార్థ సంఘటనే ఇది..!
అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'తారామణి'. ఈ చిత్రం తమిళ్లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెప్టెంబర్ 21 న తారామణి విడుదలకు సిద్దమవుతొంది. చైన్నై లొ జరిగిన ఓ యదార్ద ప్రేమకథ ఆధారంగా దర్శకుడు రామ్ తారామణి ని తెరకెక్కించారు. ఆద్యంతం వినొదాత్మకంగా ఈ సినిమా ఉంటుందని నిర్మాత డి.వెంకటేష్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు.
Next Story