Wed Apr 24 2024 10:36:13 GMT+0000 (Coordinated Universal Time)
టాక్సీవాలా ట్రైలర్ అదుర్స్
గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ పాపులారిటీ ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. అలాంటి పాపులర్ హీరో ఇప్పుడు టాక్సీవాలా అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. జిఏ2 పిక్చర్స్, యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా... రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్స్, సాంగ్స్, ప్రమోషనల్ వీడియోలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలు చిత్రం ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. హారర్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. విజయ్ నటన, మ్యూజిక్, ఫోటోగ్రఫీ ట్రైలర్ లో హైలెట్ అనేలా ఉన్నారు. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
Next Story