బాబుగారి వలన.. ఆ సీన్స్ లేపేస్తారా?

తెలుగు రాష్ట్రాల్లో మెల్లమెల్లగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. టీడీపీ కాంగ్రెస్ ఒక్కటి కావడం..కేంద్రంలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పే ప్రయత్నంలో ఉండటం. బీజేపీ ని సెంట్రల్ లో కిందకు దింపడమే లక్ష్యంగా చంద్రబాబు రాహుల్ గాంధీ తో కలిసి తెలంగాణాలో తెరాస మీద పోటీ చేయడానికి రెడీ అయ్యాడు. అయితే టీడీపీ కాంగ్రెస్ తో కలవడం.. ఆ ప్ర‌భావం ‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్‌పైనా పుష్క‌లంగా చూపించే అవ‌కాశాలు ఉన్నాయి.

గతంలో ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించినప్పుడు సెంట్రల్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ సమయంలో కాంగ్రెస్ కొమ్ములు విరిచి ఆంధ్ర ప్ర‌దేశ్‌లో లో ఓ ప్రాంతీయ పార్టీ జెండా రెప‌రెప‌లాడ‌డం కేవ‌లం ఎన్టీఆర్ ఘ‌న‌త‌. అప్పటినుండి టీడీపీ – కాంగ్రెస్ కు గొడవ స్టార్ట్ అయింది. ఇప్పుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో ఈ అంశానికీ చాలా ప్ర‌ధాన్యం ఉంది.

ఎన్టీఆర్ ఆ టైములో కాంగ్రెస్ కి వ్య‌తిరేకంగా ఎన్నో నినాదాలు చేసారు. కుటుంబ పాల‌న‌పై ఎన్టీఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్ పై తన డైలాగ్స్ తో దుమ్మెత్తి పోశారు. ఆ సీన్ లు… డైలాగ్స్ ‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్‌లో ఉన్నాయి కూడా. మరి ఇప్పుడు టీడీపీ – కాంగ్రెస్ తాజా దోస్తీతో ఆ డైలాగులకు క‌త్తెర్లు ప‌డ‌డం ఖాయ‌మ‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాలు అభిప్రాయ ప‌డుతున్నాయి. ఒకవేళ ఉన్నది ఉన్నట్టు చూపిస్తే వచ్చే ఎలక్షన్స్ లో టీడీపీ ని ఇతర పార్టీ వాళ్ళు ఆడుకునే అవకాశం ఉందని అందుకే ఆయా డైలాగుల‌కు క‌త్తెర వేయడం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*