సామ్రాట్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తేజు
బిగ్ బాస్ సీజన్ 2 లో పార్టిసిపెంట్‌గా వెళ్లిన తేజస్వి మదివాడ చాలా సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. రామ్ గోపాల్ వర్మ తీసిన ఐస్ క్రీం సినిమాలో హాట్ హాట్ గా కనిపించిన తేజు బిగ్ బాస్ వెళ్ళాక హాట్ టాపిక్ గా మారింది.
చాన్నాళ్ల పాటు హౌస్‌లో కొనసాగిన తేజు హౌస్‌లో ఆమె మరో క్యారెక్టర్ నటుడు సామ్రాట్‌తో చాలా సన్నిహితంగా మెలగడం చర్చనీయాంశమైంది. అయితే ఆ షో అయ్యాక వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని వార్తలు వచ్చాయి. దీనిపై తేజు తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చింది.
నేను అందరితో సరదాగా ఉంటాను..మొదటి నుండి ఒంటరి జీవితానికి అలవాటు పడ్డానని..కానీ సామ్రాట్ విషయంలో ఇంకొంచం సన్నిహితుడిగా అనిపించాడని తేజస్వి చెప్పింది. తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు..కష్టాలన్నీ సామ్రాట్ తో పంచుకోవాలనిపించిందని అంతే తప్ప తమ ఇద్దరి మధ్య అటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది తేజు. హౌస్ నుండి బయటికి రాగానే అందరు సామ్రాట్ తో పెళ్లి ఎప్పుడు అని అడుగుతుంటే కోపం వస్తుందని అందుకే మరోసారి క్లారిటీ ఇస్తున్న అని చెప్పింది.