పూజ ఎపిసోడే హైలెట్

పూజ హెగ్డే pooja works for threee movie at a time

నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన గద్దలకొండ గణేష్(వాల్మీకి) సినిమాకి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులే కాదు.. క్రిటిక్స్ కూడా వరుణ్ తేజ్ సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చారు. దర్శకుడు హరీష్ శంకర్ తమిళ జిగర్తాండ ని యాజిటీజ్ గా దించకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ గద్దలకొండ గణేష్ సినిమాని రీమేక్ చేశాడు. అయితే సినిమాలో వరుణ్ తేజ్ మాస్ లుక్, ఆయన డైలాగ్ డెలివరీ, కథ, కథనం, మిక్కీ జె కీర్ మ్యూజిక్, నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ అన్ని బావున్నప్పటికీ… స్లో నేరేషన్, సెకండ్ హాఫ్ వీక్ అవడం, కామెడీ తక్కువ కావడంతో సినిమాకి యావరేజ్ టాక్ పడింది.

అదరగొట్టేసింది…

అయితే సినిమాలోని సెకండ్ హాఫ్ లో పూజ హెగ్డే – వరుణ్ తేజ్ ల ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడే హైలెట్ అంటున్నారు. పూజ హెగ్డే శ్రీదేవి కేరెక్టర్ లో అదరగొట్టడమే కాదు.. వరుణ్ తేజ్ తో ఉన్న రొమాంటిక్ కాంబో సీన్స్ కి విజిల్స్ పడుతున్నాయి. ఫస్ట్ హాఫ్ లో పూజ ఎంట్రీ లేక బోర్ కొట్టిన ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ లో వెల్లువచ్చి గోదారమ్మ సాంగ్ తో కడుపు నిండిపోయింది. సెకండ్ హాఫ్ మొత్తంలో ఆ పాటని ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేయించింది. పూజ గ్లామర్ గా కాకుండా డి గ్లామర్ గా అదరగొట్టేసింది. సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుడిని కాస్త ఊరటనిచ్చింది మాత్రం వరుణ్ తేజ్ ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్ లో పూజ తో చేసిన రొమాన్స్ అంటున్నారు.

.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*