సైరాకి ఆ రెండే బలం!!

సైరా ఎఫెక్ట్

మెగాస్టార్ చిరు ఖైదీ నెంబర్ 150 తర్వాత చాలా గ్యాప్ తో సై రా సినిమా తో అక్టోబర్ 2 న ఫ్యాన్స్ నే కాదు.. యావత్ భారతాన్నిఉర్రుతలూగించడానికి వచ్చేస్తున్నాడు. సై రా నరసింహారెడ్డి గా చిరు లుక్స్ , సినిమా టీజర్, ఆ భారీ తనం అన్ని సినిమా మీద భారీ హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న సై రా సినిమాకి రెండే రెండు బలాలు అంటూ దర్శకుడు సురేందర్ రెడ్డి  చెబుతున్నాడు. ఈ సినిమాలో దాదాపుగా ఒళ్ళు గగుర్పొడిచే.. 10 యాక్షన్ సీన్స్ ఉన్నాయని.. కానీ అందులో రెండు మాత్రం సై రా నరసింహారెడ్డికి ఎంతో బలమైన సన్నివేశాలని చెబుతున్నాడు.

హైలెట్ కానున్న యాక్షన్  సీన్లు  ….

అన్నింటి కన్నా ఎక్కువగా క్లైమాక్స్ కన్నా ముందు వచ్చే యాక్షన్ సీన్ సినిమా కే హైలెట్ అంటున్నాడు. ఆ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తాయని… సురేందర్ రెడ్డి చెబుతున్నాడు. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు వచ్చే యాక్షన్ సీన్ కూడా హైలెట్ అంటున్నాడు. ఈ యాక్షన్స్ సీన్ ని అండర్ వాటర్ లో చిత్రీకరించారని, దాని కోసం ముంబై లోని భారీ స్విమ్మింగ్ పూల్ ని వాడామని చెబుతున్నాడు. ఆ స్విమ్మింగ్ పూల్ లో ఈ భారీ యాక్షన్.. వాటర్ సన్నివేశాలను చిత్రీకరించామని.. ఈ యాక్షన్ సీన్ ప్రేక్షకుడిని మునివేళ్ళ మీద నిలబెడుతుందని చెబుతున్నాడు. ఈ సినిమా కథ స్వాతంత్య్రం వచ్చిన కాలంలో ఉంది కాబట్టి.. ఆ కాలం ప్రతిబింబించేలా సెట్స్ వేసి మరీ యుద్ధ సన్నివేశాలని చిత్రీకరించినట్లుగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.

 

 

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*