ఆ హీరోయిన్ వెంట పడ్డారు!!

Sayesha

హీరోయిన్ పెళ్లి చేసుకుంది అంటే చాలు.. ఆమెకి ఎప్పుడు ప్రెగ్నెంట్ అని చెబుదామా.. అని చాలామంది గాసిప్ రాయుళ్లు కాచుకుని కూర్చుంటారు. బాలీవుడ్ లో దీపికా పదుకునె ఎయిర్ పోర్ట్ లో ఒక డ్రెస్ లో తన పొట్ట భాగం కాస్త ఎత్తుగా కనబడితే చాలు.. దీపికా పడుకునే కి మూడు నెలల ప్రెగ్నెంట్ అనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమంటుంది. రణ్వీర్ తో పెళ్లయిన కొన్నాళలకే దీపికా ఇలాంటి వార్తల బారిన పడింది. ఇక టాలీవుడ్ లో అక్కినేని సమంత కూడా ఇలాంటి వార్తలను ఫేస్ చేసింది. ఇప్పటికి సమంత ప్రెగ్నెన్సీ కోసమే సినిమాలు ఒప్పుకోవడం లేదనే టాక్ నడుస్తుంది.

తాజగా ఇప్పుడు మరో కోలీవుడ్ హీరోయిన్ పై ఇలాంటి న్యూస్ లే ప్రచారం లోకొచ్చాయి. కోలీవుడ్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న సయ్యేషాకి తెలుగులో హిట్స్ దక్కలేదు.. కానీ కోలీవుడ్ మాత్రం రెడ్ కార్పెట్ పరిచింది. అయితే సయేశా గత ఏడాది హీరో ఆర్య ని వివాహం చేసుకుంది. తర్వాత హాని మూన్ కి వెళ్లొచ్చిన ఈ జంట షూటింగ్స్ తో బిజీ అయ్యారు. అయితే తాజాగా సయేశా సినిమాలేవీ ఒప్పుకొని కారణంగా.. సయేశా ప్రెగ్నెంట్ వార్తలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. ఈమధ్యన సయేశా కాస్త బొద్దుగా ముద్దుగా తయారైంది. అలాగే కాస్త లూజ్ గా ఉన్న దుస్తులు ధరించడంతో.. సయేశా ప్రెగ్నెంట్ అనే వార్తలు ఊపందుకున్నాయి. మరి దీపికా, సమంత లాగే సయేశా ప్రెగ్నెన్సీ రూమరా.. నిజమా అనేది కొన్నాళ్ళాగితే కానీ తెలియదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*