వీళ్ళు ఇంకా క్లోజ్ గానే ఉన్నారుగా?

Monal Akhil

బిగ్ బాస్ హౌస్ నుండి గత ఏడాది పునర్నవి – రాహుల్ సిప్లిగంజ్ ప్రేమ పక్షుల్లా పాపులర్ అయ్యి బయటికి వచ్చారు. కానీ ఆ జంట తర్వాత కలిసి పార్టీలు చేసుకున్న సందర్భాలు పెద్దగా లేవు. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో జంట పక్షుల్లా మారి హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయిన అఖిల్ – మోనాల్ జంట ని బిగ్ బాస్ బాగా పాపులర్ చేసింది. మోనాల్ – అఖిల్ మధ్యన సం థింగ్ సం అంటూ ప్రచారం జరిగేలా వాళ్ళ మూమెంట్స్ ఉన్నాయి. ఇక బయటికొచ్చాక బెస్ట్ ఫ్రెండ్స్ లా కవరింగ్ ఇస్తున్న ఈ జంట ఎక్కడ చూసినా జంట పక్షుల్లా వీర విహారం చేస్తుంది. అఖిల్ – సోహెల్ – మోనాల్ లు న్యూ ఇయర్ పార్టీ అంటూ చేసిన హంగామా మరవకముందే ఇప్పుడు మరోసారి దొరికిపోయింది ఈ జంట.

Monal Akhil

అఖిల్ మోనాల్ లు బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చినాక కూడా బంకలా అతుక్కునే ఉన్నారనడానికి ఈ పిక్ ఉదాహరణగా సరిపోతుందేమో. అఖిల్ తో క్లోజ్ గా హాట్ గా మోనాల్ చైర్ లో కూర్చుని ఇచ్చిన హాటెస్ట్  ఫోజ్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. ఈ జంటక నెటిజెన్స్ లైక్ ల మీద లైక్స్ షేర్స్ మీద షేర్ లు కొడుతున్నారు. అంతేనా భలే క్యూట్ గా ఉంది ఈ జంట అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మరి మోనాల్ బిగ్ బాస్ నుండి బయటికొచ్చాకా కెరీర్ లో దూసుకుపోతూ అవకాశాల మీద అవకాశాలు పట్టేస్తుంది. అఖిల్ కి ఇంకా కెరీర్ స్టార్ట్ అయినట్లుగా లేకపోయినా.. ఓ అభిమాని అఖిల్ కి విలువైన లాప్ టాప్ ఇవ్వడం, అలాగే మోనాల్, అఖిల్, సోహెల్ ల పార్టీ వంటి విషయాలతో అఖిల్ తన క్రేజ్ తగ్గకుండా చూసుకుంటున్నాడు.

Ravi Batchali
About Ravi Batchali 32412 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*