టాలీవుడ్ లో లేదు ఓన్లీ కోలీవుడ్

కోలీవుడ్

మన టాలీవుడ్ వాళ్లు ఎందుకో దీపావళిని ఎంకరేజ్ చేయరు. పెద్దగా సినిమాలు ఏమి రిలీజ్ చేయరు. దీపావళికి రిలీజ్ చేస్తే సినిమా రిజల్ట్ వేరేలా వస్తుందని గట్టి నమ్మకం మన టాలీవుడ్ మేకర్స్ కి. దీపావళి అంటే మనకు అంతగా కలిసి రాదు. కానీ దీపావళి రోజు పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు కోలీవుడ్ వాళ్లు. ప్రతి దీపావళికి పెద్ద సినిమాలు ఉండేటట్టు చూసుకుంటున్నారు తమిళ మేకర్స్. అలానే ఈ సారి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కోలీవుడ్ లో. ఆ రెండు సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి.

ఒకే రోజు రెండు సినిమాలు….

ఒకటి కార్తి కొత్త సినిమా `ఖైదీ` ఈ దీపావ‌ళికి విడుదల కానుంది. కొన్ని సినిమాలు వరుస ఫ్లాపుల‌తో కార్తి కెరియ‌ర్ బాగా డ‌ల్ అయిపోయింది. ఈ సినిమాతో ఎట్టిపరిస్థితుల్లో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు కార్తి. ఈ మూవీ తో హిట్ కొట్టి తన మార్కెట్ ను స్ట్రాంగ్ గా నిలపెట్టాలని చూస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. స్టార్ హీరో విజయ్ నటించిన బిగిల్. ఈ సినిమా తెలుగులో `విజిల్‌` అనే పేరుతో రిలీజ్ అవుతుంది. యంగ్ డైరెక్టర్ అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీపై త‌మిళ‌నాట భారీ అంచ‌నాలున్నాయి. మరి ఒకే రోజు వస్తున్న ఈ సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*