అలియా కోసం వెతికా అంటున్న టాప్ స్టార్

ఉన్నదీ ఉన్నట్టు చెప్పే విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. మనసులో ఏం దాచుకోకుండా అన్ని చెప్పేసే విజయ్ లేటెస్ట్ గా గల్లీబాయ్ చిత్రం చూసి తన ఆనందాన్ని మీడియా వారితో పంచుకున్నారు. గల్లీబాయ్ చిత్రం తనను ఎక్కువ ప్రభావితం చేసిందని ఆ మూవీ చూసిన తరువాత అలియా భట్ ను అభినందించాలని అనుకున్నట్లు చెప్పారు. ఆ టైములో ఆమె నెంబర్ కోసం కరణ్ జోహార్ కు మెసేజ్ చేశానని చెప్పారు. మరి కరణ్ రిప్లయ్ ఇచ్చాడా? ఒకవేళ ఇస్తే అలియా ఎలా స్పందించింది? ఇటివంటి ప్రశ్నలకు సమాధానం ఇంకా చెప్పలేదు విజయ్. ఆ సినిమా చూసిన తరువాత తనకు నిద్ర కూడా పట్టలేదు అని చెప్పాడు. ఇదంతా చూస్తుంటే విజయ్ గల్లీబాయ్ ని తెలుగు లో రీమేక్ చేసేటట్టు ఉన్నాడు. త్వరలోనే ఈ గుడ్ న్యూస్ చెప్తాడేమో చూద్దాం.

 

 

 

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*