సమంత యు-టర్న్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
సమంత ప్రధాన పాత్రలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యు టర్న్ మూవీ సూపర్ టాక్ తోనే కాదు.. సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలైన మొదటి షోకే హిట్ టాక్ తెచ్చుకుంది. సమంత కేరెక్టర్, ఆమె నటన, గ్లామర్ అన్ని సినిమాకు ప్లస్ గా మారడమే కాదు... స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, నేపధ్య సంగీతం, డైరెక్షన్ అన్ని సినిమా విజయానికి దోహద పడ్డాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో బాగానే కలెక్షన్స్ కొల్లగొట్టింది. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ తో దూసుకుపోతున్న శైలజ రెడ్డి అల్లుడితో గట్టి పోటీకి దిగిన యు టర్న్ కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ఫస్ట్ వీకెండ్ లో యు టర్న్ వరల్డ్ వైడ్ గా కొల్లగొట్టిన కోట్లు...
ఏరియా: ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ కోట్లలో
నైజాం 1.12
సీడెడ్ 0.35
గుంటూరు 0.28
ఈస్ట్ గోదావరి 0.25
వెస్ట్ గోదావరి 0.19
కృష్ణ 0.33
నెల్లూరు 0.11
ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 2.99
ఇతర ప్రాంతాలు 0.27
ఓవర్సీస్ 0.80
వరల్డ్ వైడ్ షేర్స్ 4.06