కావాలని విరోధం కొని తెచ్చుకుంటాడా?

మహానటి బయోపిక్ ఎంతగా విజయం సాధించిందో… చెప్పనలవి కాదు. ఇక తర్వాత ఎన్టీఆర్ బయో పిక్ మీద అంత క్రేజ్ జనాల్లో ఉంది. ఎన్టీఆర్ బయో పిక్ మీద హాట్ హాట్ న్యూస్ ప్రచారంలో ఉండగా… గత రెండు రోజులనుండి సినిమా అవకాశాలు లేక.. జీవితంలో కుదురుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఉదయ కిరణ్ బయో మీద రకరకాల న్యూస్ లు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. అది కూడా ఎన్టీఆర్ బయో పిక్ దర్శకత్వ బాధ్యతలనుండి బయటికి వచ్చిన తేజ, ఉదయ కిరణ్ బయో పిక్ చేయబోతున్నాడని. ఉదయ కిరణ్ కి తేజ కి మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే ‘కాబోయే అల్లుడు’ అనే టైటిల్ తో తేజ, ఉదయ కిరణ్ బయో పిక్ తెరకెక్కిస్తున్నట్టుగా ఫిలిం సర్కిల్స్ లో ఒకటే హాట్ హాట్ చర్చలు.

అయితే ఉదయ్ కిరణ్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనలు, అలాగే తన సినిమా జీవితంపై తేజ ఈ సినిమాని తియ్యబోతున్నాడట. అందులోను ఉదయ్ కిరణ్ రియల్ లైఫ్ లో మెగాస్టార్ చిరు కి కాబోయే అల్లుడిగా ప్రచారంలోకొచ్చాడు. చిరు కి అల్లుడు కాబోయి మిస్ అయిన సందర్భాన్ని మెయిన్ పాయింట్ గా తేజ, ఉదయ కిరణ్ బయో పిక్ ని తెరకెక్కించబోతున్నట్లుగా.. చిరు కేరెక్టర్ కోసం ఈ సినిమాలో రాజశేఖర్ దిగుతున్నట్టుగా తెగ ప్రచారం జరుగుతుంది. రాజశేఖర్ కి కాబోయే అల్లుడిగా ఉదయ కిరణ్ పాత్రధారి నటించడం వంటి విషయాలతో ఈ బయో పిక్ ఉండబోతుందట. అయితే చిరంజీవి కేరెక్టర్ వెయ్యడానికి రాజశేఖర్ సిద్దపడతాడా? అనేది పెద్ద అనుమానమే.

ఎందుకంటే చిరంజీవికి రాజశేఖర్ కి మధ్య గతంలో గొడవలున్నప్పటికీ.. ఈ మధ్యన మాత్రం మంచిస్నేహం కొనసాగిస్తున్నారు. గతంలో చిరు తో ఉన్న గొడవలు ఇకపై ఉండవని జీవిత, రాజశేఖర్ లు గరుడావెగా ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చారు. అలాగే తన పెద్ద కూతురు మెడికల్ సీట్ కోసమై చిరు గారి హెల్ప్ తీసుకున్నామని కూడా రాజశేఖర్ దంపతులు చెప్పారు.అలాగే దర్శకుడు తేజ కి రాజశేఖర్ కి మధ్యన అనుకున్నంత సత్సంభందాలు లేవు. గతంలో నేనే రాజు నేనే మంత్రి విషయంలో వీరికి విభేదాలు రావడంతో ఆ కథతో రానా హీరోగా తేజ సినిమా చేసి హిట్ కొట్టాడు. మరి ఇన్ని గొడవల మధ్యన రాజశేఖర్, ఉదయ్ కిరణ్ బయోపిక్ లో చిరు కేరెక్టర్ చెయ్యడానికి ఒప్పుకునే ఛాన్స్ లేదంటున్నారు. చూద్దాం జరగబోయేదేమిటో..?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*