ఆయనకే సినిమాల్లేవు.. నాకేం వేషమిస్తాడు!!

కృష్ణవంశీ ప్రస్తుతం డిజాస్టర్ లిస్ట్ లో ఉన్నాడు. ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ ని రీమేక్ చేస్తున్నాడు కృష్ణవంశీ. రంగమార్తాండ అంటూ ప్రకాష్ రాజ్ – రమ్యకృష్ణ – అనసూయ లతో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే గతంలో కృష్ణవంశీ భారీ డిజాస్టర్స్ తీసినప్పుడు సినిమా సినిమాకి  మధ్యలో భారీ గ్యాప్ వచ్చింది. అయితే గతంలో నటుడు ఉత్తేజ్ కి కృష్ణవంశీ కి మధ్యలో ఏదో గొడవ అయ్యింది అని.. అందుకే ఉత్తేజ్ కృష్ణవంశీ సినిమాల్లో కనిపించడం లేదని ప్రచారం జరిగింది. గతంలో కృష్ణవంశీ సినిమాల్లో ఉత్తేజ్ కనిపించేవాడు. కానీ.. గత కొన్నాళ్లుగా కృష్ణవంశీ సినిమాల్లో ఉత్తేజ్ లేకపోయేసరికి వారి మధ్యన గొడవ అనే టాక్ బయలుదేరింది.

అయితే తాజాగా నటుడు ఉత్తేజ్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కృష్ణవంశీ కి తనకి ఎలాంటి గొడవ లేదని.. కృష్ణవంశీతో కలిసి కనబడితే మేమిద్దరం స్నేహితులమని, లేదంటే శత్రువులం అని కాదని… కృష్ణవంశీ నాకు అవకాశాలు ఇవ్వడం లేదంటే.. ప్రస్తుతం ఆయనకే సినిమాలు లేవు.. అలాంటప్పుడు ఆయన నాకు అవకాశాలు ఏం ఇస్తాడు.. అలా అని అయన సినిమాల్లో నేను లేకపోతె ఆయన కి నాకు స్నేహం లేదని కాదని, ఇక కృష్ణవంశీ ఇప్పటికి నాకు ఫోన్ మెసేజ్ లు చేస్తూనే ఉంటాడు. సో ఆయనకి నాకు మధ్యలో ఎలాంటి గొడవలు లేవని ఉత్తేజ్ స్పష్టం చేసాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*