ఎన్టీఆర్, విజయ్ తో కూడానా

చాలా కాలం తర్వాత ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన వైజ‌యంతీ మూవీస్‌ ఆ సినిమాతో వారికి పెద్దగా పేరు రాలేదు కానీ ఆ తర్వాత నిర్మించిన ‘మ‌హాన‌టి’తో పూర్తి ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం వీరి బ్యానర్ లో ‘దేవదాస్’ చిత్రం 27న విడుద‌ల అవ్వబోతుంది. రిలీజ్ కి ముందే ఈ సంస్థ టేబుల్ ప్రాఫిట్‌ని ద‌క్కించుకుంది.

ఈ ఉత్సాహంతోనే మ‌రిన్ని కొత్త సినిమాల‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతోంది ఈ సంస్థ. ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా నిర్మించాలనుకుంటున్నారు. అయితే దానికి ఎవరు డైరెక్టర్ అని ఇంకా ఫిక్స్ అవ్వలేదు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేయనున్నారు మేకర్స్. అలానే విజయ్ దేవ‌ర‌కొండ‌తో రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు వైజ‌యంతీ వారు. మరోపక్క మన తెలుగు డైరెక్టర్స్ తోనే కాకుండా తమిళ డైరెక్టర్స్ కి కూడా అవకాశం ఇస్తుంది ఈ సంస్థ.

తమిళ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేయడానికి సైన్ చేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వాటికి సంబంధించి క‌థా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఎన్టీఆర్ లేదా విజయ్ తో ఐన అట్లీ ఈ బ్యానర్ లో సినిమా చేసే అవకాశముంది. రాజమౌళి మ‌ల్టీస్టార‌ర్ తర్వాత ఎన్టీఆర్ ఈ బ్యానర్ లో చేయనున్నాడు. మరి ఇన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో ఏది ముందు సెట్స్ మీదకు తీసుకుని వెళ్తారో త్వరలోనే తెలియనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*