మాస్ ని పడెయ్యడం ఖాయం!!

వాల్మీకి

ఎప్పుడూ సాఫ్ట్ పాత్రలతోనే హిట్స్ కొడుతున్న వరుణ్ తేజ్ మొదటిసారిగా వాల్మీకి సినిమాలో మాస్ మసాలా పాత్ర చెయ్యబోతున్నాడు. గద్దలగుంట గణేష్ గా వరుణ్ పాత్ర వాల్మీకి లో అదిరిపోతోంది. ఎప్పుడూ క్లాస్ లుక్ తోనే ఆకట్టుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం పెంచిన గడ్డం , బాడీ లాంగ్వేజ్ అన్ని వరుణ్ లుక్ ని హైలెట్ చేస్తున్నాయి. ఈ నెల 20న విడుదల కాబోతున్న వాల్మీకి సినిమా మీద మంచి క్రేజ్ ఉంది. అలాగే వరుణ్ లుక్ తోనే సరిపెట్టుకుంటున్న మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు.

మాస్ ప్రేక్షకులకోసం వరుణ్….

వరుణ్ తేజ్ ఈ సినిమాలో మాస్ మసాలా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నప్పటికీ… ఫ్యాన్స్ హార్ట్ అవకుండా ఓ ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్ ని హరీష్ శంకర్ అద్భుతంగా ప్లాన్ చేసాడట. రేపు విడుదల కాబోతున్న నాని గ్యాంగ్ లీడర్ కన్నా ఎక్కువగా వరుణ్ వాల్మీకి మీద ప్రేక్షకుల్లో పిచ్చ ఇంట్రెస్ట్ ఉంది అంటే నమ్మాలి. ఎందుకంటే.. గద్దలగుంట గణేష్ పాత్రలో వరుణ్ బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ లుక్స్, మాస్ డైలాగ్స్ చెప్పిన విధానం అన్ని వాల్మీకి ట్రైలర్ తోనే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయాయి. మరి వాల్మీకి సినిమాతో వరుణ్ తేజ్ ఈసారి మాస్ ప్రేక్షకులను పడెయ్యడం ఖాయంగానే కనబడుతుంది.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*