హీరోయిన్ గానే కాదు.. విలన్ గాను వేస్టే
తమిళంలో శరత్ కుమార్ కూతురు, విశాల్ మాజీ గర్ల్ ఫ్రెండ్ వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా కెరీర్ లో వెనకబడిపోయేసరికి విలన్ అవతారమెత్తింది. హీరోయిన్ లక్షణాలు [more]
తమిళంలో శరత్ కుమార్ కూతురు, విశాల్ మాజీ గర్ల్ ఫ్రెండ్ వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా కెరీర్ లో వెనకబడిపోయేసరికి విలన్ అవతారమెత్తింది. హీరోయిన్ లక్షణాలు [more]
తమిళంలో శరత్ కుమార్ కూతురు, విశాల్ మాజీ గర్ల్ ఫ్రెండ్ వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా కెరీర్ లో వెనకబడిపోయేసరికి విలన్ అవతారమెత్తింది. హీరోయిన్ లక్షణాలు ఏ కోశానా లేని వరలక్ష్మి శరత్ కుమార్ కి విలన్ లక్షణాలు మాత్రం పుష్కలంగా వున్నాయి. ఆమె చూపు, ఆమె బాడీ తీరు, ఆమె పొగరు అన్ని విలన్ పాత్రలకి చాలా దగ్గరగా ఉండడంతో… గ్లామర్ హీరోయిన్ వేషాలకు బై బై చెప్పేసి స్టార్ హీరోల సినిమాలలో విలన్ గా సెటిలవుదామనుకుంటుంది. విశాల్ పందెంకోడి 2 సినిమాలో విలనిజాన్ని పండించింది. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. అయితే ఆ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ పాత్ర కూడా అంతగా ఎక్కలేదు.
ఇక విజయ్ లాంటి స్టార్ హీరో సర్కార్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్ర చేసింది. విజయ్ మీద పొలిటికల్ విలన్ గా వరలక్ష్మి అదరగొట్టిందనే చెప్పాలి. ఆ పాత్ర బావుంది, వరలక్ష్మి విలన్ నటనకు మంచిమార్కులు పడ్డాయి. కానీ సినిమా యావరేజ్ అవడంతో.. పాపకి హిట్ పడలేదు. ఇక తాజాగా తెలుగులోనూ సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ బిఎ బి ఎల్ లోను వరలక్ష్మి ఓ పవర్ ఫుల్ రోల్ చేసింది. వరలక్ష్మీ దేవి పాత్రలో ఓ జర్నలిస్ట్ మర్డర్ కేసులో ఇరుకుంటుంది. అయితే వరలక్ష్మి తన పాత్ర పరిధిమేర చక్కగానే నటించింది. కానీ సినిమాకే ప్లాప్ టాక్ రావడంతో.. వరలక్ష్మి పాత్ర కూడా తేలిపోయింది. మరి ఇక్కడా వరలక్ష్మి కి వర్కౌట్ అవ్వలేదు. మరి రవి తేజ -గోపీచంద్ మలినేని సినిమాలో ఛాన్స్ కొట్టేసిన వరలక్ష్మి ఆ సినిమాలో అయినా క్లిక్ అవుతుందో.. లేదంటే మళ్ళీ కోలీవడ్ కే చెక్కేస్తుందో చూడాలి