సత్తా చాటుతానంటుంది

హీరో విశాల్

కోలీవుడ్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కోలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్ కాకపోయినా… తనకు సరిపోయే పాత్రలను ఎంచుకుంటూ సినిమా ల్లో దూసుకుపోతుంది. వరలక్ష్మి సినిమాల కన్నా ఎక్కువగా విశాల్ తో ప్రేమ వ్యవహారంతోనే.. హైలెట్ అయ్యేది. కాగా ఈమధ్య విశాల్, వరలక్ష్మి లవ్ లో బ్రేకప్ అయ్యారనే న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో వినబడింది. కానీ ఈ ప్రేమ విషయంలో విశాల్ ఈమధ్యనే ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. తమ మధ్యన ఏం లేదని.. కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందన్నాడు. ఇక వరలక్ష్మి కోలీవుడ్ సినిమా ల్తో బిజీగా ఉండేది.. కానీ ఆమె సినిమాలు పెద్దగా తెలుగులోకి వచ్చి హిట్ అయినా సందర్భాలు లేవు.

అయితే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్న కోలీవుడ్ సినిమాలు వరుసగా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించబోతున్నాయి. వరలక్ష్మి బొద్దుగా ఉండడంతో తమిళులకు నచ్చుతుంది కానీ.. తెలుగు ప్రేక్షకులకు అంతగా ఎక్కదు. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ గ్లామర్ రోల్స్ చేసిన సినిమాలేవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఆమె స్టార్ హీరోల సినిమా ల్లో చేసిన కీలక పాత్రలున్న పెద్ద సినిమాలు తమిళమ తో పాటుగా తెలుగులో కూడా విడుదల కాబోతున్నాయి. అందులో విశాల్ పందెం కోడి సీక్వెల్, ధనుష్ మారి సీక్వెల్, మురుగదాస్ – విజయ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాల్లో వరలక్ష్మి కీ రోల్స్ పోషించింది. ఆ సినిమాలే ఇప్పుడు తమిళంతో పాటుగా.. తెలుగులోనూ విడుదల కానున్నాయి.

విశాల్ పందెం కోడి సీక్వెల్ లో వరలక్ష్మి ఒక నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తుండగా… ధనుష్ మారి సీక్వెల్ లో మాత్రం కలెక్టర్ పాత్ర చేస్తుంది. అలాగే విజయ్ – మురుగదాస్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ లో వరలక్ష్మి రాజకీయ నాయకురాలిగాను కనిపించనుంది. మరి ఈ మూడు సినిమాలు తెలుగులో హిట్ అయితే… వరలక్ష్మి కి తెలుగులోనూ మంచి ఆఫర్స్ వస్తాయనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. చూద్దాం కోలీవుడ్తో పాటుగా టాలీవుడ్ లోను వరలక్ష్మి ఏమాత్రం బిజీ తార అవుతుందో. అయితే టాలీవుడ్ లో ఆమెకి హీరోయిన్స్ ఆఫర్స్ రావు కానీ… స్పెషల్ కేరెక్టర్స్ మాత్రం వస్తానే టాక్ వినబడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*