విజయ్ కొట్టాడుగా..

విజయ్ దేవరకొండ vijya devarakonda

విజయ్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కిన గీత గోవిందం చిత్రం ఈ నెల 15న విడుదలై ఇప్పటికి హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతుంది. మొదటి రోజు నుండి ఇప్పటివరకు గీతకి గోవిందానికి ప్రేక్షకులు పిచ్చిగా ఆదరణ చూపుతున్నారు. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విజయ్ గీత గోవిందం ఓవర్సీస్ లోను హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో వీర బాదుడు బాదుతూ.. 2 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టింది. మరి బాహుబలి నుండి మొదలు పెడితే… ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో వరకు దాదాపుగా రంగస్థలం, భరత్ అనే నేను, శ్రీమంతుడు, మహానటి, అ.. ఆ.., ఖైదీ నెంబర్ 150 , ఫిదా, అజ్ఞాతవాసి .. తాజాగా విజయ్ గోవిందం సినిమాలు 2 మిలియన్ క్లబ్బులో చోటు సంపాదించిన సినిమాలుగా నిలిచాయి. మరి చాలా తక్కువ సినిమాల్తో ఉన్న హీరో విజయ్ ఇలా అతి కొద్దీ కాలంలోనే ఓవర్సీస్ లో 2 మిలియన్ అడుగుపెట్టడం అనేది నిజంగా రేర్ ఫీట్ అని చెప్పొచ్చు. ఇకపోతే 2 మిలియన్ క్లబ్బులో ఉన్న 12 సినిమాల లిస్ట్ మీకోసం.

 

1. బాహుబలి 2 (అల్ వెర్షన్స్ ) $21.00
2. బాహుబలి ( అల్ వెర్షన్స్) $8.460
3. రంగస్థలం $3.513
4. భారత్ అనే నేను $3.416
5. శ్రీమంతుడు $2.891
6. మహానటి $2.544
7. అ..ఆ.. $2.449
8. ఖైదీ నెంబర్.150 $2.447
9. ఫిదా $2.067
10.అజ్ఞాతవాసి $2.065
11.నాన్నకు ప్రేమతో $2.022
12.గీత గోవిందం $2.020

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*