విజయ్ దేవరకొండ జోక్యం ఎక్కువ అయిపోయిందట!

విజయ్ దేవరకొండ vijya devarakonda
అవును విజయ్ దేవరకొండ కి స్టార్ ఇమేజ్ వచ్చినా మాటా వాస్తమే. అయితే దర్శకుల పనిలో వేలు పెడతాడా? ఇదివరకు మార్కెటింగ్ వరకే ఇంవోల్వ్ అయిన విజయ్ ఇప్పుడు డైరెక్షన్ లో ఇంవోల్వ్ అవుతున్నాడు. గీత గోవిందం తరువాత తన రేంజ్ మారిపోవడంతో మనోడికి జాగ్రత్తలు ఎక్కువ అయిపోయాయి. దాంతో దర్శకుల పనిలోను వేళ్లు బాగా పెడుతున్నాడని చెవులు కొరుక్కుంటున్నారు.
తన లేటెస్ట్ చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రానికి దేవరకొండ ఓవర్‌గా ఇన్‌వాల్వ్‌ అవుతున్నాడట. ఏ సీన్ ఉండాలో, ఏ సీన్ తీసేయాలి కూడా విజయ్ చెప్పడంతో డైరెక్టర్ భరత్ కమ్మ అలిగి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకి దూరంగా ఉంటున్నాడని టాక్ ఉంది. అయిన కానీ విజయ్ కూసింత కూడా ఫీల్ అవ్వడంలేదట. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడట. అయితే డైరెక్టర్ తో గొడవ పడడం లాంటిది చేయకుండా అతనితో టచ్‌లోనే వుంటున్నాడని, ఎప్పటికప్పుడు వాట్సాప్‌లో అప్‌డేట్స్‌ ఇస్తున్నాడని ఇండస్ట్రీలో చెబుతున్నారు.

దేవరకొండ తో సినిమా చేస్తే మంచి పేరు వస్తుంది అనేదానికన్నా అతని ఇంవోల్వ్మెంట్ ఎక్కువా ఉంటుందనే దాని గురించి భయపడుతున్నారు డైరెక్టర్స్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*