కరణ్ ఏమంటున్నాడు పూరి?

Vijay

పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ కోసం ఫైటర్ కథ రాసి వినిపించగా.. విజయ్ దేవరకొండ ఈ కథ తో పాన్ ఇండియా మూవీ చేద్దామని బాలీవుడ్ లో తనకున్న పరిచయాలతో కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్ తో కలిసి ఈ సినిమాని నిర్మించేలా ప్లాన్ చేసాడు. పూరి – ఛార్మి – కరణ్ జోహార్ లు సంయుక్తంగా ఫైటర్ సినిమా ని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరణ్ జోహార్ కనుసన్నల్లో ముంబై పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 40 శాతం పూర్తయ్యింది. అయితే కరోనా అడ్డంకి వలన ఈ సినీమా షూటింగ్ ఆగింది కానీ.. లేదంటే పూరి జగన్నాధ్ స్పీడు కి ఈపాటికి విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడే. అయితే కరోనా కారణంగా మిగిలిన షూటింగ్ ముంబైలో జరపలేమని, దానికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ లోనే ముంబై సెట్ వేసి సినిమాని షూటింగ్ చెయ్యబోతున్నారంటూ వార్తలొచ్చాయి.

అయితే ప్రస్తుతం కరణ్ జోహార్ సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం తర్వాత ఎవరికి అందుబాటులోకి రావడం లేదు. కనీసం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉండడం లేదు. బాలీవుడ్ మొత్తం కరణ్ జోహార్ చుట్టూనే తిరుగుతుంది అని.. కరణ్ జోహార్ లాంటి వాళ్ళ వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ సుశాంత్ అభిమానులు కరణ్ పై కత్తికట్టారు. కరణ్ జోహార్ ని ఆయన అభిమానులే అన్ ఫాలో చెయ్యడం, నానారకాల తిట్లతో కరణ్ ని భయపెట్టడంతో కరణ జోహార్ ప్రస్తుతం సైలేంట్ గా ఉన్నాడు. అయితే పూరి జగన్నాధ్ కరణ్ జోహార్ తో విజయ్ దేవరకొండ సినిమా విషయమై చర్చిస్తున్నాడని, హైదరాబాద్ లోనే సెట్ వేసి షూట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనని కరణ్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది. కొన్ని సన్నివేశాలు యుఎస్ బ్యాక్ డ్రాప్ లో ఇంటర్నేషనల్ ఫైటర్స్ చిత్రీకరించాల్సి ఉండగా.. ఇప్పుడు దీనికి ప్రత్యామ్న్యాయంగా ఏం చెయ్యాలని పూరి – కరణ్ డీప్ డిస్కషన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది.

Ravi Batchali
About Ravi Batchali 27796 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*