ఎప్పటికి పూర్తి చేస్తావయ్యా..?

పవన్ కల్యాణ్

పవన్ కళ్యాణ్ సినిమాల లిస్ట్ రోజు రోజుకి పెరిగిపోతోంది. పవన్ సినిమాలు చేస్తుంటే ఆయన ఫాన్స్ కి పండగే. కానీ నిర్మాతలకు గండం. ఎందుకంటే పవన్ తో సినిమాలు కమిట్మెంట్ చేయించుకుని ఆనందపడేలోపే పవన్ కళ్యాణ్ చాలాసార్లు చాలా నిర్మాతలకు హ్యాండ్ ఇచ్చేసాడు. గతంలో అంటే అజ్ఞాతవాసి టైములో రెండు మూడు సినెమాలకు అడ్వాన్స్ తీసుకున్నాక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లి నిర్మాతలకు పరీక్ష పెట్టాడు. మళ్ళీ సినిమాల్లోకి వచ్చేవరకు ఆ నిర్మాతలకు కంటి మీద కునుకు లేదు. కారణం అడ్వాన్స్ ఇచ్చి లాక్ అయ్యి.. పవన్ కోసం పిచ్చెక్కేలా ఎదురు చూసారు. ఓకె ఎలాగో వచ్చాక వకీల్ సాబ్, క్రిష్, హరీష్ సినిమాలు పూర్తి చేసే పోతాడనుకుంటే…. మళ్ళీ మరో రెండు సినిమాలు లైన్ లోకొచ్చాయి.

పవన్ కళ్యాణ్ తో సినిమాలు చెయ్యాలని కలలు కన్నా దర్శకనిర్మాతలు పవన్ కోసం కథ, స్క్రిప్ట్ పూర్తి చేసుకుని ఎదురు చూసేలా కనబడుతుంది వాళ్ళ వ్యవహారం. కానీ పవన్ కళ్యాణ్ చాలా స్లో గా షూటింగ్ చేస్తాడు. తిక్కలెగిస్తే రాజకీయాలంటాడు. పవన్ ఏం చేస్తాడో పవన్ కే క్లారిటీ ఉండదు. మరి వరస సినిమాలతో పవన్ అందరిని హుషారు చేస్తున్నాడు కానీ.. తర్వాత నిర్మాతలు, దర్శకులు పవన్ వలన ఇబ్బంది పడాలి. నిర్మాతలంటే ఓకె.. ఎలాగో ఎప్పటికైనా పవన్ సినిమా చేస్తాడు. కానీ దర్శకులు పవన్ కోసం వేచి చూడలేరు… అలాగని మధ్యలో సినిమాలు చెయ్యలేరు. మరి వరసగా మొదలు పెట్టిన సినిమాలన్నీ పవన్ ఎప్పటికి పూర్తి చేస్తాడో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 31105 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*