అంత సీక్రెట్ ఎందుకు దేవా?

Prabhu deva

నయనతార తో లవ్ లో ఉన్నపుడు నయన్ తో పెళ్లి కోసమని 16 ఏళ్ళు కాపురం చేసిన భార్య రామలత్ కి విడాకులిచ్చి మరీ నయనతార ని పెళ్లి చేసుందామనుకున్నాడు ప్రభుదేవా. రామలత్ కి విడాకులిచ్చినా ప్రభుదేవాకి నయనతార షాకిచ్చింది. నయనతారతో చాలా ఏళ్ళు ప్రేమాయణం నడిపిన ప్రభుదేవా ముందు వెనక ఆలోచించకుండా భార్యకి విడాకులిచ్చి వార్తల్లో నిలిచాడు. పాపం భార్య కి విడాకులిచ్చినా నయనతారతో మాత్రం పెళ్లి కాలేదు ప్రభుదేవాకి. తర్వాత బాలీవుడ్ సినిమాల్తో బాగా బిజీ అయిన ప్రభుదేవా మళ్ళీ పెళ్లి సోషల్ మీడియాకెక్కింది. ప్రభుదేవా ఓ డాక్టర్ పిల్లని మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ నడుస్తుండగానే.. అసలు ప్రభుదేవా రెండో పెళ్లి ముచ్చట ఎప్పుడో జరిగిపోయింది అంటున్నారు.

గత సెప్టెంబర్ లోనే ప్రభుదేవా రెండో పెళ్లి నిరాడంబరంగా సీక్రెట్ గా జరిగినట్టుగా చెబుతున్నారు. ప్రభుదేవా పెళ్లి ముంబైలో  జరిగిందని.. ప్రభుదేవా సెకండ్ వైఫ్ కలిసి ముంబై లోనే ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ డాక్టర్ ప్రభుదేవాకి ఎలా పరిచయం అయ్యిందో కూడా చెబుతున్నారు. ప్రభుదేవా వెన్ను నొప్పితో బాధపడుతున్న టైం లోనే ప్రభుదేవాకి ఆ డాక్టర్ అమ్మాయితో పరిచయం ఏర్పడి.. అది కాస్తా ప్రేమకి దారి తీసింది అని.. తర్వాత ప్రభుదేవా ఆమెని వివాహం చేసుకున్నాడని చెబుతున్నారు. మరి ఇంత పెద్ద విషయం ప్రభుదేవా దాచడానికి కారణాలు ఏమిటి అనేది తెలియడం లేదు. సెలెబ్రిటీ అన్నాక అనేక విషయాలు ఉంటాయి. అవి ఎంత దాచిపెట్టిన లీకవ్వకుండా ఉండవు. అన్ని తెలిసిన ప్రభుదేవా కి అంత సీక్రెట్ ఎందుకో అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*