రాజకీయాలు మీకు సరిపోవు అంటే కోపం వచ్చింది!!

Yandamuri

యండమూరి వీరేంద్ర నాధ్ కి మెగా హీరోలంటే పడదు. చిరంజీవికి యండమూరి కి మనస్ఫర్ధలున్నాయని.. యండమూరి ఒకసారి రామ్ చరణ్ ని అవమానించేలా మాట్లాడాడని, మెగా ఫాన్స్ ఫైర్ అవడమే కాదు… ఈ విషయంలో నాగబాబు కూడా ఫైర్ అయ్యాడు. ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ అయిన చిరు – యండమూరి తర్వాతర్వాత శత్రువులుగా మారిపోయారని అంటుంటారు. యండమూరి నవల్స్ ని సినిమాలుగా చేసి చిరు చాలానే హిట్స్ కొట్టాడు. అయితే తాజాగా చిరు – యండమూరి గొడవ విషయంపై యండమూరి క్లారిటీ ఇచ్చాడు. తాను చిరు మృగరాజు సినిమా చేస్తున్నప్పుడు చిరు ని కలిసి తన కొడుకు పెళ్లికి ఫైనాన్షియల్ హెల్ప్ చెయ్యమని అడిగితే.. దానికి చిరు ఆ సినిమాని నిర్మిస్తున్న నాగబాబు దగ్గరకి వెళ్ళమ్మని చెప్పారు. అప్పుడు నేను నాగబాబుగారిని కలిసి మృగరాజు సినిమాకి మాట సహాయం చెయ్యగా నాగబాబు తనకు నాలుగు లక్షలు ఇవ్వగా.. వాటితో కొడుకు పెళ్లి చేసానని చెబుతున్నాడు.

అయితే యండమూరి స్నేహితుడైన చిరుతో  మీకు రాజకీయాలు సరిపడవని, ఆయన వ్యక్తిత్వానికి రాజకీయాలను సెట్ కావని…. ఆ విషయమే ఆయనకి చెప్పా అని, కానీ చిరు గారు రాజకీయపార్టీ పెట్టి ఓ సభ ఏర్పాటు చేసి మాట్లాడుతుండగా.. అది ఓ ఛానల్ లో ప్రసారమవుతున్న వేళ నేను వేరే ఛానల్ లో చిరంజీవి రాజకీయాలకు సరిపడవని, అందులో ఆయన సక్సెస్ కారనే చర్చలో పాల్గొన్నానని ఆ విషయం తెలిసిన చిరంజీవి నొచ్చుకున్నారని.. అప్పుడే కాస్త అపార్ధాలు చోటు చేసుకున్నాయి కానీ మా మధ్యన మరే అపార్ధాలు లేవంటూ చిరు – యండమూరి గొడవలకి క్లారిటీ ఇచ్చాడు యండమూరి.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*