కేరాఫ్ సూర్య మూవీ రివ్యూ – 2

నటీనటులు : సందీప్ కిషన్, విక్రాంత్, మెహ్రీన్ కౌర్, సత్య, ప్రవీణ్, ధనరాజ్
సంగీతం : డి.ఇమ్మాన్
నిర్మాత : చక్రి చిగురుపాటి
దర్శకత్వం : సుశీంథిరన్

ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చినా.. వెంటనే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో హిట్ కొట్టి ఇండస్ట్రీలో పాతుకుపోయాడు…. కెమెరామెన్ చోటా కె నాయుడు మేనల్లుడు సందీప్ కిషన్. ఈమధ్యనే కృష్ణ వంశి దర్శకత్వంలో నటించిన నక్షత్రం కోలుకోలేని అపజయం అందించినా సందీప్ కిషన్ ఏమాత్రం డీలాపడకుండా తన నెక్స్ట్ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ సుశీంథిరన్ దర్శకత్వంలో కేరాఫ్ సూర్య లో నటించాడు. కేరాఫ్ సూర్య అటు తమిళం ఇటు తెలుగులో ఏకకాలంలో తెరకెక్కింది. ఇప్పుడిప్పుడే తమిళ మార్కెట్ ని కూడా సెట్ చేసుకుంటున్న సందీప్ కిషన్ ఒక కమర్షియల్ హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. ఇక వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో సందీప్ కి జోడిగా నటించడం వంటి పలు విషయాలు ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిషన్ కి లక్కీ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ వలన ఎంతవరకు కలిసొచ్చిందో.. ప్రేక్షకులు కేరాఫ్ సూర్యను ఎంతవరకు ఆదరించారో… సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
తన ఇంట్లో ఎటువంటి చీకు చింత లేకుండా తన తల్లితో పాటే హాయిగా కాలంగడిపే సూర్య(సందీప్ కిషన్) కి స్నేహమంటే పిచ్చి. స్నేహం కోసం ప్రాణమిచ్చే సూర్యాకి… ఒకసారి ఆ స్నేహం వలెనే అనేక కష్టాలు అనుభవిస్తాడు. సూర్య ,మహేష్ (విక్రాంత్) లు ప్రాణ మిత్రులు. అనుకోని కారణాల వలన సూర్య, మహేష్ కి మాట మాట పెరిగి విభేదాలు వస్తాయి. అదే సమయంలో మహేష్ ఒక గొడవలో ఇరుక్కుంటాడు. ఆ గొడవ వలన మహేష్ తోపాటు అతని కుటుంబ సభ్యులు కూడా ప్రమాదంలో పడతారు. తన ప్రాణ మిత్రుడు తో గొడవ పడినప్పటికీ… మహేష్ అతని కుటుంబం ప్రమాదంలో ఉందని తెలిసి వారికి కాపాడడానికి సూర్య వస్తాడు. మహేష్ అతని కుటుంబాన్ని కాపాడే సమయంలో సూర్యకి నమ్మలేని షాకింగ్ విషయం తెలుస్తుంది. అసలు సూర్యకి తెలిసిన షాకింగ్ విషయమేమిటి? మహేష్ ఎవరి వలన ప్రమాదంలో పడతాడు? ఆ ప్రమాదం నుండి మహేష్ ని అతని కుటుంబాన్ని సూర్య ఎలా రక్షిస్తాడు? అనే విషయాలు స్క్రీన్ మీద చూస్తేనే మజా కలుగుతుంది.

నటీనటుల నటన:
సందీప్ కిషన్ స్టయిల్లో నటనతో చక్కగా ఆకట్టుకున్నాడు. గతంలో సందీప్ కిషన్ టైగర్ సినిమాలో స్నేహం కోసం ఎంతగా తాపత్రయ పడతాడో.. అంతకన్నా ఎక్కువగా ఈ సినిమాలో తన పాత్రని పండించాడు. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో, లవ్ సీన్స్ లో సందీప్ నటన ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ సందీప్ కిషన్ నటన. ఎమోషనల్, ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్ ఇలా సినిమాలో వచ్చే ప్రతి సన్నివేశానికి తన నటనతో పూర్తి న్యాయం చేశాడు. మెహ్రీన్ పాత్ర నటనకు పెద్దగా స్కోప్ లేను పాత్ర ఆమెది. ఉన్నంతలో క్యూట్ లుక్స్ తో మెప్పించింది. సందీప్ కిషన్ ఫ్రెండ్ గా విక్రాంత్ బాగా నటించాడు. విలన్ గా హరీష్ ఉత్తమన్ తన పాత్రలో జీవించేశాడు. సత్య తో పాటే మిగతా నటీనటులందరూ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు:
ఒక చిన్న పాయింట్ తీసుకొని దానికి ఫ్రెండ్షిప్, సిస్టర్ సెంటిమెంట్ జోడించి దర్శకుడు ఈ కథను సిద్ధం చేసుకున్నాడు. ఒక విభిన్న కథను మంచి స్క్రీన్ ప్లే తో చూపించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. గతంలో వచ్చిన నా పేరు శివ చిత్రం తరహాలోనే ఏ సినిమాలో ఆసక్తికర సన్నివేశాలు, హీరోయిజాన్ని ఎలివేట్ చేసే స్క్రీన్ ప్లే వుంది. అయితే స్టోరీ లైన్ చాలా వీక్ గా ఉండడం, కథనంలో కొన్ని పొరపాట్లు దొర్లడంతో సినిమా ఏవరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. విలన్.. హీరో కుటుంబంపై దాడి చేయడం వంటి సన్నివేశాలు సాగదీసి చూపించారు. అంతేకాకూండా హీరోహీరోయిన్స్ కి మధ్యన మరిన్ని రొమాంటిక్ సన్నివేశాలు పెట్టినట్లయితే… సినిమా స్థాయి మరోలా ఉండేది. సినిమాలో కమెడియన్స్ ఉన్నప్పటికీ కామెడీ మాత్రం పెద్దగా పండలేదు.

టెక్నీకల్ గా… ఇమ్మాన్ అందించిన సంగీతం మాములుగా అంటే యావరేజ్ గా అనిపిస్తుంది. పాటలన్ని తమిళులను ఆకట్టుకోవడానికే అన్నట్టుగా తమిళ వాసన కొట్టినట్టుగా వున్నాయి. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ ని ఇమ్మాన్ అదరగొట్టేసాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ అప్పుడు, యాక్షన్ సన్నివేశాల్లోను బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. హీరోయిజాన్ని యాక్షన్ సన్నివేశాల్లో సినిమాటోగ్రఫీ బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ విషయంలో చాలా లోపాలున్నాయి. కొన్ని సీన్స్ డ్రాగ్ చేసినట్లుగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవుతాడు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్: సందీప్ కిషన్ నటన, మెహ్రీన్ లుక్స్, కథ, కథనం, యాక్షన్ సీన్స్, సినిమాటోగ్రఫీ, విలన్ పాత్ర
మైనస్ పాయింట్స్: ఎడిటింగ్, సంగీతం, తమిళ ఫ్లేవర్, కామెడీ లేకపోవడం

రేటింగ్: 2.5/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*