ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌ మూవీ రివ్యూ (2.75/ 5)

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌ మూవీ రివ్యూ
బ్యానర్: స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెం
న‌టీన‌టులు: న‌వీన్ పోలిశెట్టి, శృతి శ‌ర్మ సుహాస్,అప్పాజీ అంబరీశ దర్భా త‌దిత‌రులు
స్క్రీన్‌ప్లే: న‌వీన్ పోలిశెట్టి
సంగీతం: మార్క్ కె.రాబిన్‌
సినిమాటోగ్రఫీ: స‌న్నీ కూర‌పాటి
నిర్మాత‌: రాహుల్ యాద‌వ్ న‌క్కా
ద‌ర్శక‌త్వం: స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో గోల్డ్ ఫేస్ కుర్రాడిగా… బి ఫేసు కుర్రాళ్ళతో గొడవ పడే కేరెక్టర్ లో మెప్పించిన నవీన్ పోలిశెట్టి.. యూట్యూబ్ వీడియోస్ తో బాగా ఫేమస్ అయ్యాడు. అయితే తాజాగా నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు. స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌ అనే డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేసాడు. డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కి మంచి క్రేజ్ ఉన్న టైం లో నవీన్ ఈ క్రైమ్ థ్రిల్లర్ చెయ్యడం, ట్రైలర్ తోనే సినిమాపై ఆసక్తి ని అంచనాలు పెంచెయ్యడం జరిగింది. చిన్న సినిమాగా భారీ ప్రమోషన్స్ తో నవీన్ పోలిశెట్టి హీరోగా పరిచయం కాబోతున్న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌ డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు అవచ్చింది. మరి నవీన్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌ తో హీరోగా హిట్ అందుకున్నాడా.. లేదా.. అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (నవీన్ పొలిశెట్టి) నెల్లూరులో ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ పేరుతొ ఒక చిన్న డిటెక్టివ్ ఆఫీస్ ని నడిపేవాడు. చిల్లర కేసుల‌ని చ‌టుక్కున ఛేదిస్తూ డ‌బ్బు సంపాదిస్తుంటాడు. ఎప్పటికైనా పెద్ద కేసు రాక‌పోతుందా… అని ఆశ‌గా ఎదురు చూస్తుంటాడు. ఆత్రేయ దగ్గర అసిస్టెంట్‌గా స్నేహ (శృతి శ‌ర్మ) పనిచేస్తుంది. అయితే ఏదైనా పెద్ద కాసు దొరికితే…  దాన్ని పరిష్కరించి పెద్ద డిటెక్టివ్ ఏజెంట్ అయిపోవాలని ఆత్రేయ ఆశ. ఈ విషయంలో క్రైమ్ రిపోర్టర్ అయిన తన స్నేహితుడి సాయం తీసుకుంటాడు ఆత్రేయ. ఒక రోజు తన ఫ్రెండ్ ఫోన్ చేసి నెల్లూరు శివారులో రైల్వే ట్రాక్ పక్కన ఒక శవం పడి ఉందని, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయమని చెబుతాడు. వెంటనే ఆత్రేయ అక్కడికి వెళ్తాడు. కానీ, పోలీసులు ఈ కేసులో ఆత్రేయను నిందితుడిగా అరెస్టు చేస్తారు. ఆ శవం వెనకాల జరుగుతోన్న క్రైమ్ ఏమిటి? అసలు ఆత్రేయ కు ఆ కేసుకి సంబంధం ఏమిటి? ఆత్రేయను పోలీస్ లు ఎందుకు టార్గెట్ చేశారు? అసలు ఆత్రేయ పెద్ద కేసుని ఛేదించగలిగాడా? అసలు జైలు నుండి ఆత్రేయ విడుదలయ్యాడా? అనేది మొగత కథ.

నటీనటుల నటన:
అసలు నవీన్ పొలిశెట్టి అంటే తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా తెలియకపోవచ్చు.  ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ పాత్రలో న‌టించిన న‌వీన్  త‌న న‌ట‌న‌తో పాత్రకి ప్రాణం పోశాడు. ఈ సినిమాకు మూలస్తంభం నవీన్. అసలు ఆత్రేయ ఆ పాత్రలో మ‌రొక‌రిని ఊహించుకోలేం అన్నట్టుగా ఉంది. కామెడీ టైమింగ్‌లో, ఎమోషనల్ సీన్స్‌లో నవీన్ నటన చాలా బాగున్నాయి. స్నేహ అనే అసిస్టెంట్  పాత్రలో శ్రుతి శ‌ర్మ చ‌క్కటి అభిన‌యం ప్రద‌ర్శించింది. ప్రధాన పాత్రతో పాటే సినిమా అంతా క‌నిపిస్తుంది. ఈ సినిమాకి నవీన్, శృతి ఈ రెండు పాత్రలే కీల‌కం. ఇక మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు.

విశ్లేషణ:
మొదటి మూవీ అయినా కూడా దర్శకుడు స్వరూప్ ఎంచుకున్న కథ, అలాగే చెప్పిన విధానం చాలా బాగుంది. వాస్తవికతకు దగ్గరగా ఉన్న హీరో నవీన్ అందించిన స్క్రీన్ ప్లే ప్రేక్షకుడికి ప్రతి క్షణం ఉత్కంఠను ఫీల్ అయ్యేలా చేస్తుంది. మూఢ నమ్మకాలను అడ్డుపెట్టుకుని శవాలతో ఎలాంటి వ్యాపారం చేస్తున్నారనే కాన్సెప్ట్‌ను స్వరూప్ తీసుకున్నారు. కథ ఎంత బాగుందో కథనం అంతకు మించి ఉంది. సినిమా చూసే ప్రేక్షకుడికి తరవాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని కలిగించడంలో దర్శకుడు పూర్తిగా సఫలమయ్యారు. కథకు అవసరంలేని పాటలు, ఫైట్లు వంటి కమర్షియల్ హంగులకు దూరంగా కేవలం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను మాత్రమే నమ్ముకుని ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించారు. ఫస్ట్ హాఫ్ పాత్రల ప‌రిచయానికి, అస‌లు కేసుని మొద‌లు పెట్టడానికి ఉప‌యోగించుకున్నాడు ద‌ర్శకుడు. అక్కడక్కడా కొన్ని స‌న్నివేశాలు చ‌ప్పగా అనిపించినా… ఏజెంట్ పాత్ర చేసే సంద‌డి మంచి కాలక్షేపాన్నిస్తుంది. అస‌లు కేసు ప‌రిశోధ‌న ఎప్పుడైతే మొద‌ల‌వుతుందో అప్పట్నుంచి క‌థ వేగం అందుకుంటుంది. సెకండ్ హాఫ్ లో సాగే ప‌రిశోధ‌న అంతా కూడా థ్రిల్‌కి గురిచేస్తుంది. ప్రేక్షకుడి ఊహ‌కు అంద‌ని రీతిలో స‌న్నివేశాలు సాగుతుంటాయి. అయితే ఆ మ‌లుపుల అక్కడక్కడా మోతాదు మ‌రీ శ్రుతిమించాయి. దాంతో కొన్నిచోట్ల గంద‌రగోళంగా అనిపిస్తుంది. అంత‌లోపే ద‌ర్శకుడు మ‌ళ్లీ ప్రీ క్లైమాక్స్ స‌న్నివేశాల‌పై ప‌ట్టు బిగించాడు. కేవలం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకుడికి వినోదాన్ని పంచే కామెడీ కూడా సినిమాలో పుష్కలంగా ఉంది. డిటెక్టివ్ ఏజెంట్‌ ఆత్రేయ చేసే ఇన్వెస్టిగేషన్‌లో కామెడీని పండించారు. ఈ కామెడీ కథతో పాటు సాగుతుంది. ఎక్కడా బలవంతంగా చొప్పించిన భావన కలగదు. ఓవరాల్ గా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌ ప్రేక్షకులను అలరించడం ఖాయం.

ప్లస్ పాయింట్స్: నవీన్ పోలిశెట్టి నటన, కథ, కథనం, కామెడీ

మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ లో మలుపులు, లాస్ట్ 30 నిముషాలు

రేటింగ్: 2.75/ 5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*