భానుమతి రామకృష్ణ మూవీ ఓటిటి రివ్యూ

Bhanumathi Ramakrishna Movie Review

భానుమతి రామకృష్ణ మూవీ ఓటిటి రివ్యూ
నటినటులు: నవీన్ చంద్ర, సలోని లూత్రా, హర్ష చెముడు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్
ఎడిటర్: రవికాంత్ పేరెపు
నిర్మాత: యశ్వంత్ ములుకుట్ల
దర్శకత్వం: శ్రీకాంత్ నగోటి 

ప్రస్తుతం థియేటర్స్ మూత పడడంతో. .. ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ పండగ చేసుకుంటున్నాయి. చిన్న, మీడియం సినిమాలను కొనేస్తూ ఓటిటి లో విడుదల చేస్తూ ప్రతి వారం ప్రేక్షకుల ముందుకు ఏదో ఓ సినిమాని తీస్కోస్తున్నాయి. ఇంతకుముందు అమృత రామన్, కీర్తి సురేష్ పెంగ్విన్, కృష్ణ హిస్ లీల తాజాగా నవీన్ చంద్ర భానుమతి రామకృష్ణ సినిమాలు ఈ ఓటిటి నుండి నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి. ఇక ఇప్పటివరకు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ , హాట్  స్టార్ ల హావ కొనసాగితే.. టాలీవుడ్ లో కొత్తగా ఆహా అంటూ ఓ డిజిటల్ ప్లాట్ ఫామ్ ని మొదలు పెట్టారు అల్లు అరవింద్ వాళ్ళు. ప్రస్తుతం నవీన్ చంద్ర భానుమతి రామకృష్ణ ఆహా డిజిటల్ ప్లాట్ ఫారం నుండే ప్రేక్షకుల్ ముందుకు వచ్చింది. గత వారం రోజులుగా మంచి పబ్లిసిటీ తో సినిమాపై అంచనాలు పెరిగితే.. తాజాగా విడుదలైన భానుమతి రామకృష్ణ ట్రయిలర్ సినిమాపై ఆసక్తి పెంచింది. మరి భానుమతి రామకృష్ణ సినిమా ప్రేక్షకులకు ఏ మేర నచ్చిందో.. సమీక్షలో చూసేద్దామా…

కథ:
భానుమ‌తి (సలోని లూత్రా) 30 ఏళ్లు దాటినా పెళ్ల‌వ్వ‌లేదనే ఫ్ర‌స్ట్రేష‌న్ లో ఉన్న అమ్మాయి‌. అందులోనూ భానుమతి లైఫ్ లో ఓ బ్రేక‌ప్ కూడా ఉండడంతో.. ‌. దాన్ని మ‌ర్చిపోయేందుకు ప‌బ్ లూ, సినిమాలు అంటూ తిరిగే అమ్మాయి. ఇక రామ‌కృష్ణ (న‌వీన్ చంద్ర‌) .. పాత  చంటి సినిమాలో వెంక‌టేష్ ఎలా ఉండేవాడో.. అలంటి టైప్ అబ్బాయి. నుదుట బొట్టు, ప‌క్క పాపిటి తీసుకున్న పక్కా  పల్లెటూరి బైతు టైపన్నమాట. ఇక భానుమతి మాత్రం లైఫ్ అంతా త‌న ఛాయిస్ ప్ర‌కార‌మే సాగాలి అనుకుంటుంది. మొండిత‌నం ఎక్కువ ఉన్న అమ్మాయి‌. స్వతంత్రంగా బ్రతకాలనీ కోరుకునే అమ్మాయి. అలాంటి భానుమతి దగ్గరకు హెల్పేర్ గా వ‌స్తాడు రామ‌కృష్ణ‌. ముందు రామకృష్ణ మీద సదాభిప్రాయం లేకపోయినా.. తర్వాత రామకృష్ణ మంచితనంతో అతనిపై ప్రేమ పెంచుకుంటుంది. . అలాగే రామకృష్ణ కూడా భానుమతిలోని మొండితనం కాకుండా.. ఆమెలోని మరో కోణం చూసి ఇష్టపడతాడు. ఇద్దరు దగ్గరవుతున్నా తరుణంలో ఏమైందో ఏమో…  విడిపోతారు. అసలు రామకృష్ణ అలా అన్నేళ్లు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం ఏమిటి? భానుమతి – రామకృష్ణ ల ప్రేమ మధ్యలో ఎందుకు బ్రేకప్ అయ్యింది? మల్లి వాళ్లిద్దరూ కలిసారా? పెళ్లి చేసుకున్నారా? అనేది తెలియాలి అంటే.. ఆహా ఓటిటి లో సినిమా చూడాల్సిందే. 
నటీనటుల నటన:
నవీన్ చంద్ర హీరోగా సక్సెస్ కాకపోయినా.. విలన్ పాత్రల్తోనూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా భానుమతి రామకృష్ణ లో పెళ్లికాని కుర్రాడిగా.. రామకృష్ణ పాత్రకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. చిన్న టౌన్ నుంచి వ‌చ్చిన ఓ మామూలు కుర్రాడి నవీన్ చంద్ర భ‌లే సూటయ్యాడు. నవీన్ చంద్ర డైలాగ్ డెలివ‌రీతోనూ, మేన‌రిజం తో ఆకట్టుకున్నాడు. ఎమోష‌న్స్ పరంగా నవీన్ చంద్ర నూటికి నూరు శాతం మార్కులు వేయించుకున్నాడు. ఇక హీరోయిన్ సలోని గురించి చెప్పాలంటే… భానుమతి పాత్ర‌కు త‌గ్గ‌ట్టు అమ్మాయి ముదురుగా ఉంది. హావభావాలు, ఎమోషనల్ గాను ఆకట్టుకుంది. వైవా హర్ష మాత్రం అదరగొట్టేసాడు. ఇక భానుమతి మాజీ లవర్.. ఇలా మిగతా నటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు. 

విశ్లేషణ:
ఒక వారం  నుండి పోస్టర్స్ తో సోషల్ మీడియాలో హడావిడి తప్ప ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమాని ఓటిటి లో విడుదల చేస్తున్నామని.. పబ్లిసిటీ చేసుకోవడానికి లేదు.. అయినా నవీన్ చంద్ర లుక్ పై అందరిలో ఏదో ఆసక్తి. మరీ వయసైపోయిన కుర్రాడిగా కనిపించడం తప్ప దర్శకుడు భానుమతి రామకృష్ణ సినిమాని ఎలా తెరకేక్కించాడో అనేది తప్ప సినిమాపై ఎలాంటి ఊహాగానాలు లేవు. అయితే దర్శకుడు సినిమాని ఓటిటి లో విడుదల చేద్దామని ముందు అనుకుని కూడా ఉండదు.ఆ అందుకే మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి సరిపోయే కతతో ఈ భానుమతి రామకృష్ణ ని తెరకెక్కించాడు. చాలా సింపుల్ కథని. ఏజెడ్ లవ్ స్టోరీ ని ఎమోషనల్ గా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాని తక్కువ బడ్జెట్ తో దర్శకుడు మలిచాడు. రామకృష్ణ అండ్ భానుమతి పత్రాలు నటనలోనూ, ప్రేమలోనూ ఒకరితో ఒకరు పోటీ పది నటించేలా కథను అల్లాడు. చిన్న చిన్న ఎమోష‌న్స్‌, ఆకట్టుకునే డైలాగ్స్‌, పట్టుసడలని క‌థ‌నం భానుమ‌తి – రామ‌కృష్ణ ని నిల‌బెట్టాయి అనే చెప్పాలి. ఏజెడ్ లవ్ స్టోరీని మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా మర్చి.. దర్శకుడు ఈ సినిమాని అందరికి కనెక్ట్ అయ్యేలా చేసాడు. ఇక సినిమాలో వైవా హర్ష చెప్పిన కామెడీ డైలాగ్స్ ఆదిరిపోయాయి. అలాగే అక్కడక్కడా పేలిన డైలాగ్స్ సినిమాకే హైలెట్ అనేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఎడా పెడా డ్యూయెట్స్ పెట్టి బోర్ కొట్టించకుండా బ్యాగ్రౌండ్ కె పాటలను పరిమితమ చెయ్యడం బావుంది. కాకపోతే స్క్రీన్ ప్లే చాల స్లోగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా హైలెట్స్ లో సినిమాటోగ్రఫీ

ప్లస్ పాయింట్స్: నవీన్ చంద్ర – సలోని లూత్రా నటన, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్: స్లో నేరేషన్, క్లైమాక్స్

రేటింగ్: 2/5

Ravi Batchali
About Ravi Batchali 30143 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*