కల్కి మూవీ రివ్యూ (2.25/5)

కల్కి మూవీ రివ్యూ

కల్కి మూవీ రివ్యూ
బ్యానర్: శివానీ, శివాత్మిక ఫిలింస్‌
నటీనటులు: రాజశేఖర్, అదః శర్మ, నందితా శ్వేత, నాజర్‌, అశుతోష్‌ రాణా, శత్రు,రాహుల్ రామ‌కృష్ణ, చరణ్‌ దీప్‌ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: శరవణన్‌ భరద్వాజ్‌
సినిమాటోగ్రఫీ: దాశ‌ర‌థి శివేంద్ర
ఎడిటింగ్: గౌతమ్‌ నేరుసు
నిర్మాత: సి. కల్యాణ్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రశాంత్‌ వర్మ

గతంలో అల్లరి ప్రియుడు, ఆహుతి, ఆగ్రహం అంటూ హిట్ సినిమాలు చేసిన రాజశేఖర్ నుండి దాదాపుగా 10 నుండి 15 ఏళ్ళు వరకు ఒక్క హిట్ సినిమా కూడా రాలేదు. కానీ రాజశేఖర్ చాలా రోజుల తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన పిఎస్వీ గరుడ వేగా సినిమా తో మల్లి ఫామ్ లోకొచ్చాడు. ఆ సినిమాలో రాజశేఖర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అదరగొట్టాడు ప్రవీణ్ సత్తారు కథ, కథనం అన్ని ప్రేక్షకులను ఆకట్టుకుని.. ఆ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత రాజశేఖర్ అదే ఊపులో అ..! అనే సినిమా తో ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి అనే సినిమా చేసాడు. ప్రశాంత్ వర్మ అ! సినిమాని డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించి ప్రేక్షకులను గెలుచుకున్నాడు. ఆ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా.. ప్రశాంత్ వర్మ దర్శకత్వానికి మంచి పేరొచ్చింది. తాజాగా రాజశేఖర్ తో ప్రశాంత్ వర్మ కల్కి సినిమాని చేసాడు. కల్కి సినిమా మీద మొదటి నుండి మంచి క్రేజ్ ఉంది. అలాగే ఆ సినిమా మీద అంచనాలు కూడా ఉన్నాయి. ఇక కల్కి ట్రైలర్ చూసాక ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి ఏర్పడింది. మరి ప్రేక్షకుల అంచనాలు రాజశేఖర్ – ప్రశాంత్ వర్మ అందుకున్నారో?  లేదో? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత నిజాం సామ్రాజ్యంలోని కొల్లపూర్‌ సంస్థానంలో జరిగిన సంఘటనలను ఇతివృత్తంగా చేసుకుని రాసుకున్న ఫిక్షనల్ స్టోరేనీ కల్కి. కొల్లపూర్ సంస్థానానికి సేనాధిపతిగా ఉన్న నర్సప్ప (అశుతోష్ రాణా).. రజాకార్లతో చేతులు కలిపి రాజును వెన్నుపోటు పొడుస్తాడు. న‌ర‌స‌ప్ప త‌మ్ముడు శేఖ‌ర్‌బాబు (సిద్ధు జొన్నల‌గ‌డ్డ‌) మాత్రం ఊళ్లో మంచివాడిగా పేరు తెచ్చుకుంటాడు. ఇంత‌లో శేఖ‌ర్‌బాబు దారుణ హ‌త్యకు గుర‌వుతాడు. ఊళ్లో చెట్టుకి వేలాడ‌దీసి కాల్చేస్తారు. అత‌ని హ‌త్య కేసుని ప‌రిశోధించ‌డానికి ఐపీఎస్ అధికారి క‌ల్కి (రాజ‌శేఖ‌ర్) ఊళ్లోకి అడుగుపెడ‌తాడు. ఆ క్రమంలో క‌ల్కికి ఎలాంటి విష‌యాలు తెలిశాయి? అసలు శేఖ‌ర్‌బాబుకి ప్రజ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ‌ని చూసి అత‌ని సోదరుడే అతన్ని చంపాడా? లేక పెరుమాండ్లు చంపాడా? అస‌లు ఆ హ‌త్య కేసుని క‌ల్కి ఎలా ఛేదించాడు? అనేది కల్కి మిగతా కథ.

నటీనటుల నటన:
పోలీస్ పాత్రలకు రాజ‌శేఖ‌ర్ పెరిఫెక్ట్ గా సూట్ అవుతాడు. అసలు పోలీస్ పాత్రల‌కి పెట్టింది పేరు. క‌ల్కిలాంటి పాత్ర రాజశేఖర్ కి కొట్టిన‌పిండే. కానీ ఆయ‌న న‌ట‌న‌లో, క‌నిపించిన విధానంలో ఇదివ‌రక‌టి ఆక‌ర్షణ క‌రవైన‌ట్టు అనిపించింది. ఇలాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను రాజశేఖర్ పండించలేకపోయాడు. రాజశేఖర్లో వయసు స్పష్టంగా కనిపించిపోతోంది. దీనికి తోడు రాజశేఖర్ మేకప్ బాగా ఓవర్ అనిపిస్తుంది. మేకప్ వేసినట్టు స్పష్టంగా తెలిసిపోతుంది. అంతేకాదు రాజశేఖర్ ముఖంలో కూడా కళ తగ్గింది. యాక్షన్ సన్నివేశాలనైతే బాగానే మ్యానేజ్ చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద ఫైట్, ఫారెస్ట్‌లో యాక్షన్ ఎపిసోడ్ బాగున్నాయి.  ప్రథమార్ధం కంటే కూడా ద్వితీయార్ధంలో బాగా క‌నిపించాడు. అదాశ‌ర్మ డాక్టర్ గా అందంగా క‌నిపించింది. రాజశేఖర్ ప్రేయసిగా నటించిన ఆమెకి సినిమాలో పెద్ద స్కోప్ లేదు. నందితాశ్వేత పాత్ర సినిమాకు కీలకమే అయినా ఆమెకు స్క్రీన్ స్పేస్ తక్కువే. అందుకే కొన్ని స‌న్నివేశాల్లోనే ఆమె క‌నిపిస్తుంది. రాజశేఖర్ కల్కి పాత్ర తర్వాత సినిమాలో అంతగా చెప్పుకోవాల్సిన పాత్ర… రాహుల్ రామ‌కృష్ణ జర్నలిస్టు దత్తు పాత్ర. రాహుల్ రామకృష్ణ ఈ పాత్రలో చాలా నేచురల్‌గా నటించారు. ఆయన భయపడుతున్న ప్రతిసారి ప్రేక్షకుడు నవ్వుతాడు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో రాజశేఖర్, రాహుల్ రామకృష్ణ కనిపిస్తారు. హీరోతో పాటే సినిమా మొత్తం రాహుల్ క‌నిపిస్తుంటాడు. రాహుల్ యాస‌తో, న‌ట‌న‌తో చాలా స‌న్నివేశాల్లో న‌వ్వించాడు.

విశ్లేషణ:
దర్శకుడు ప్రశాంత్ వర్మ రాసుకున్న కథ చాలా బలంగా ఉంది. క్లైమాక్స్ చూసిన ప్రేక్షకుడు వారెవ్వా ఏం ట్విస్ట్ అనకమానడు. కానీ, క్లైమాక్స్‌కు ముందు జరిగిన డ్రామా, యాక్షన్ ప్రేక్షకుడిని విసిగించేస్తాయి. ఫస్టాఫ్‌లో ఒక్క ఆసక్తికర సన్నివేశం కూడా కనిపించదు. చాలా నెమ్మదిగా సాగే కథనానికి తోడు రాజశేఖర్, అదాశర్మ లవ్‌స్టోరీ చికాకు తెప్పిస్తుంది. ట్విస్టులతో కూడుకున్న కథకు పదునైన స్క్రీన్‌ప్లే తోడతైనే ఆ సినిమా ప్రేక్షకుడి నాడికి తగులుతుంది. అలాంటి స్క్రీన్‌ప్లేలోనే లోపం ఉంటే ప్రేక్షకుడు థియేటర్‌లో విసిగిపోవడం ఖాయం. ఫస్ట్ హాఫ్ లో కథేమీ లేక‌పోవ‌డంతో స‌న్నివేశాలు సాగ‌దీసిన భావ‌న క‌లుగుతుంది. ఆ స‌న్నివేశాల‌న్నీ కూడా హత్య కేసుపై అనుమానాల్ని రేకెత్తించ‌డానికే ఉప‌యోగించుకున్నాడు ద‌ర్శకుడు. ప‌రిశోధ‌న మాత్రం ఎంత‌కీ ముందుకు సాగ‌దు. విరామం స‌మ‌యానికి మాత్రం క‌థలో కాస్త వేగం పెరుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో లేవ‌నెత్తిన అనుమానాల్ని ఒక్కొక్కటిగా నివృత్తి చేసే క్రమంలో క‌థ ముందుకు సాగుతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ పర్వాలేదనిపిస్తుంది. అయినప్పటికీ కథనం నెమ్మదిగానే సాగింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం ఆసక్తిని రేకెత్తించింది. స్క్రీన్‌ప్లే పవర్‌ఫుల్‌గా రాసుకునుంటే సినిమా స్థాయి ఇంకోలా ఉండేది.

సాకేతికంగా… సంగీత ద‌ర్శకుడు శరవణన్‌ భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్ ఆకట్టుకోలేదు. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాల్లో రాజశేఖర్ కన్నా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కే బాగుంది అన్నట్టుగా ఉంది. కాకపోతే దాశ‌ర‌థి శివేంద్ర కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. 1980 కాలానికి తగ్గుట్టుగా కెమెరా వర్క్ ఉంది. ఆర్ట్ డైరెక్టర్ కూడా మంచి ఔట్‌పుట్ ఇవ్వగలిగారు. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. చాలా సీన్స్ ని రిచ్ గా చూపించాడు. ఎడిటింగ్ లో చాలా లోపాలున్నాయి. నిర్మాణ విలువలు కథానుసారంగా వున్నాయి.

ప్లస్ పాయింట్స్: రాహుల్ కామెడీ, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, సినిమాటోగ్రఫీ, క‌థా నేప‌థ్యం, సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్: మ్యూజిక్, కథ, కథనం, ఫస్ట్ హాఫ్, ఎడిటింగ్
రేటింగ్: 2.25/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*