ఊరంతా అనుకుంటున్నారు రివ్యూ

ఊరంతా అనుకుంటున్నారు రివ్యూ

శ్రీనివాస్ అవసరాల, నవీన్ విజయ్ కృష్ణ, మేఘ చౌదరి కాంబోలో బాలాజీ సనాల దర్శకత్వంలో తెరకెక్కిన ఊరంతా అనుకుంటున్నారు సినిమా నిన్న శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సీనియర్ హీరో నరేష్ కొడుకు నవీన్ హీరోగా నటించడం, విలక్షణ నటుడు శ్రీనివాస్ అవసరాల కీలక పాత్ర పోషించడం, హీరోయిన్ మేఘ చౌదరి అందంతో సినిమా మీద అందరిలో ఆసక్తి పెరిగింది. అయితే సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కడంతో ఫ్యామిలీస్ కూడా సినిమా మీద ఆసక్తిని పెంచుకున్నారు.

కథ:
రామాపురం అనే గ్రామానికి ఓ కట్టుబాటు ఉంటుంది. ఈ ఊరిలో ఎవరైనా ఓ జంట పెళ్లి చేసుకోవాలంటే… ఆ జంట పెళ్ళికి ఆ ఊరిలోని అందరూ ఆ పెళ్లిని అంగీకరించాలి. అయితే రామాపురంలో ఊరిలో పుట్టిన మహేష్ (నవీన్ విజయకృష్ణ)కి , గౌరి (మేఘ చౌదరి) అనే అమ్మాయితో పెళ్లి చేయాలని ఆ ఊరంతా ఓ నిర్ణయం తీసుకుంటారు. కానీ మహేష్, గౌరీ లు మాత్రం వేరే వారిని ప్రేమిస్తారు. ఊరంతా కలిసి తీసుకున్న నిర్ణయం కాదని మహేష్, గౌరీలు తాము ప్రేమించిన వారిని పెళ్లాడడానికి సిద్దపడతారు. మరి ఊరు కట్టుబాటుని కాదని మహేష్,గౌరీ లు తాము ప్రేమించిన వారిని పెళ్లాడారా?వారి ప్రేమలను అసలా ఊరి పెద్దలు ఒప్పుకున్నారా?పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ? అనేది ఊరంతా అనుకుంటున్నారు సినిమా కథ.

విశ్లేషణ:
దర్శకుడు బాలాజీ సనాల తీసుకున్న స్టోరీ లైన్ బావుంది. ఈ స్టోరీ మొత్తం గ్రామీణ నేపథ్యం ఉంటుంది. పల్లెటూరి పల్లె వాసనను గుర్తు చేసే సీన్స్, అలాగే బంధాలు బంధుత్వాలకి సంబంధించిన కొన్ని అంశాలు సినిమాలో కొంతవరకు ఈ ఊరంతా అనుకుంటున్నారు సినిమా ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్, రావు రమేష్ క్యారెక్టర్ ఆకట్టుకున్నా.. సినిమా మాత్రం, ఏ మాత్రం ఇంట్రస్ట్ కలిగించలేని సన్నివేశాలతో బాగా బోర్ గా సాగుతూ మొత్తానికి సినిమా ఆకట్టుకునే విధంగా లేదు. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ కథకు సంబంధమే లేకుండా సాగుతాయి. సెకెండ్ హాఫ్ లో కూడా కథనం అసలు బాగాలేదు. క్లైమాక్స్ భాగాన్ని మినహాయిస్తే.. మొత్తం సినిమా ఆకట్టుకోదు. దీనికి తోడు బలం లేని కథలో బలహీన పాత్రలను సృష్టించి సినిమా మీద కలిగే ఆ కాస్త ఇంట్రస్ట్ ని కూడా దర్శకుడు నీరుగార్చాడు దర్శకుడు. సినిమా ని ఆస్వాదిద్దామని వెళ్లిన ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ ఊరంతా అనుకుంటున్నారు సినిమా పరమ బోర్ కొట్టించడం ఖాయం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*