Tue May 07 2024 05:07:02 GMT+0000 (Coordinated Universal Time)
Corona Virus : వామ్మో ఒక్క రోజులో ఇన్ని కేసులా.. ఇలాగయితే ఇక కష్టమే
కరోనా వైరస్ కేసులు దేశంలో ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది.
కరోనా వైరస్ కేసులు దేశంలో ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 841 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. గత కొద్ది రోజుల నుంచి కరోనా వైరస్ కేసుల సంఖ్య తీవ్రతను పరిశీలిస్తే ఈరోజే అధికంగా నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సయితం అంగీకరించింది. దీంతో అన్ని రాష్ట్రాలూ కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యాక్టివ్ కేసులు కూడా...
కోవిడ్ కారణంగా బీహార్, కర్ణాటక, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య దేశంలో 4,309 కి పెరిగాయని తెలిపారు. అయితే జెఎన్ 1 వేరియంట్ కేసులు అత్యంత ప్రమాదకరమైనది కాకపోయినా జాగ్రత్తగా ఉండటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రికవరీ రేటు 98.81 శాతం ఉండటం కొంత సంతోషించదగ్గ విషయమే అయినప్పటికీ మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వినియోగం వంటివి చేయాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.
Next Story