ఆ సీటుపై వైసీపీలో ఆశలు పెరిగాయి..!

13/05/2019,07:00 ఉద.

గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేదు ఫలితాలు వచ్చాయి. రాయలసీమలోని మిగతా మూడు జిల్లాల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న ఆ పార్టీ అనంతపురం జిల్లాలో మాత్రం చతికిలపడింది. ఇక్కడి 14 నియోజకవర్గాల్లో కేవలం ఆ పార్టీ 2 స్థానాలను మాత్రమే గెలవగలిగింది. దీంతో ఈసారైనా [more]

జేసీ దివాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి

04/05/2019,12:23 సా.

ఎన్నికల్లో రూ.50 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పిన తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నేత రామకృష్ణ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ రాశారు. ఇప్పటికే తాను ఈ అంశంపై ఏప్రిల్ [more]

తాడిపత్రి ఘర్షణల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మృతి

11/04/2019,01:50 సా.

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి. తాడిపత్రి మండలం వీరవరం గ్రామంలో రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్త పుల్లారెడ్డి, టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి మృతి [more]

బ్రేకింగ్: తాడిపత్రిలో ఘర్షణలు.. ఒక వ్యక్తి మృతి

11/04/2019,12:29 సా.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతున్నాయి. తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. దీంతో సిద్ధా భాస్కర్ రెడ్డి అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మృతి చెందారు. [more]

సీఎం నివాసం వద్ద కార్యకర్త ఆత్మహత్యాయత్నం

13/03/2019,03:35 సా.

టిక్కెట్ల లొల్లి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్దకు చేరుకుంది. టిక్కెట్లు ఆశిస్తున్నా ఆశావహులు, అసమ్మతివాదులు అనుచరులతో కలిసి వచ్చి చంద్రబాబు నివాసం వద్ద ఆందోళనలకు దిగుతున్నారు. అనంతపురం టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి ఇవ్వవదని డిమాండ్ చేస్తూ ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. [more]

బాబూ.. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా..?

11/02/2019,04:14 సా.

చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి ఇవాళ ప్రత్యేక హోదా అనే పదం మళ్లీ వచ్చింది అంటే దానికి కారణం తన పోరాటమని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అనంతపురంలో ఆయన వైసీపీ బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో ‘సమర శంఖారావం’ సభ నిర్వహించారు. ఈ [more]

నేనైనా ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్లాలి

11/02/2019,01:39 సా.

తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెడతామని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అనంతపురంలో ఆయన తటస్థులతో ‘అన్న పిలుపు’ సమావేశం నిర్వహించారు. తటస్థుల నుంచి రాష్ట్రాభివృద్ధికి, వివిధ అంశాలపై సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… తమ [more]

రాళ్ల సీమను రతనాల సీమగా మారుస్తాం

29/01/2019,01:16 సా.

రాళ్ల సీమగా ఉన్న రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం కియా పరిశ్రమతో తొలి అడుగు పడిందన్నారు. మంగళవారం ఆయన అనంతపురంలో కియా మోటర్స్ తొలి కారును విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… తన జీవితంలోనే ఇది ఆనందకరమైన రోజని, [more]

టీడీపీ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు… వైసీపీకి మరో ఎమ్మెల్యే

27/11/2018,06:15 సా.

అనంతపురం జిల్లా మడకశిర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వీరన్న ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్ లో తనపై కర్ణాటకలో నమోదైన క్రిమినల్ కేసును వీరన్న దాచిపెట్టారు. వీరన్న భార్య ప్రభుత్వ ఉద్యోగి అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేయలేదు. [more]

పరిటాలకు పరోక్ష వార్నింగ్…..!!!

24/11/2018,11:36 ఉద.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలపై ఫైరయ్యారు. రెండు రోజుల పాటు అనంతపురంలో పర్యటిస్తున్న చంద్రబాబు జిల్లాలో గ్రూపులు ఎక్కువై పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారన్నారు. వారసుల కోసం పార్టీని తాకట్టు పెట్టేలా నాయకులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా నేతలతో జరిగిన సమావేశంలో [more]

1 2 3 6