ఆంధ్రప్రదేశ్ లో హై అలెర్ట్..!

22/05/2019,01:03 సా.

ఆంధ్రప్రదేశ్ లోకి ఉగ్రవాదులు ప్రవేశించారనే అనుమానాలతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పోర్టుల లక్ష్యంగా ఉగ్రవాద దాడులు జరగవచ్చనే అనుమానంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు నిఘా పెంచారు. శ్రీహరి కోటతో పాటు రాష్ట్రంలోని అన్ని పోర్టుల వద్ద భద్రత పెంచారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం [more]

ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన పోలింగ్

11/04/2019,06:08 సా.

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసింది. ఇవాళ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. ఉదయం ఈవీఎంలు పనిచేయడం లేదనే ప్రచారం జరిగినా పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి [more]

బ్రేకింగ్: ఐటీ గ్రిడ్స్ సంస్థ సీజ్

08/03/2019,06:15 సా.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల డేటా చోరీ కేసులో హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థను సిట్ సీజ్ చేసింది. రెండు రోజులుగా ఈ సంస్థ కార్యాలయంలో సిట్ సోదాలు చేస్తోంది. డేటాకు సంబంధించిన పలు హార్డ్ డిస్క్ లు, కంప్యూటర్లను సిట్ స్వాధీనం చేసుకుంది. ఐటీ [more]

శివాజీ మళ్లీ వచ్చాడ్రోయ్…!

08/03/2019,05:08 సా.

డేటా చోరీ అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి తప్పూ చేయలేదని, అధికార పార్టీ ప్రజల వివరాలను వాడుకోవడంలో తప్పు లేదని నటుడు శివాజీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన డేటా చోరీ వ్యవహారంపై  మీడియాతో మాట్లాడుతూ… దేశ రహస్యాలు, సరిహద్దు, సైన్యం, పోలీసులకు సంబంధించిన రహస్యాలు చోరీ చేస్తే డేటా [more]

బ్రేకింగ్: రెండు సిట్ లు ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్

07/03/2019,06:28 సా.

డేటా చోరీ కేసులో నిన్న తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రెండు సిట్ లను నియమించింది. డేటా చోరీ అంశంపై సీనియర్ ఐపీఎస్ అధికారి బాలకృష్ణ నేతృత్వంలో 9 మందితో సిట్ ను ఏర్పాటు చేశారు. ఇక ఫారం-7 దుర్వినియోగంపై మరో [more]

చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదు

02/03/2019,11:56 ఉద.

ఎన్నికలప్పుడు అమలు కానీ హామీలను చంద్రబాబు ఇంటింటికి తిరిగి ఎందుకు ఇస్తున్నారని సినీ నటుడు మోహన్ బాబు ప్రశ్నించారు. విద్యారంగం అభివృద్ధి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన పేర్కొన్నారు. 2014 -15 సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ ఇంకా మంజూరు చేయడం లేదని ఆరోపించారు. [more]

ఏపీకి కేంద్రం సాయం

29/01/2019,03:43 సా.

ఆంధ్రప్రదేశ్ కు కరువు సాయం నిమిత్తం రూ.900.40 కోట్లు మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం సమావేశమైంది. 2018-19 సంవత్సరానికి గానూ విపత్తులతో నష్టపోయిన ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిట ప్రాంతానికి రూ.7214.03 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ [more]

బ్రేకింగ్: ఏపీలో నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు

23/01/2019,12:42 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మొగించారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టింకోనందున ఫిబ్రవరి 6వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్లు కార్మిక నేతలు ప్రకటించారు. బుధవారం విజయవాడలో కార్మిక నేతలు మీడియాతో మాట్లాడుతూ… అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటాయని తెలిపారు. ఆర్టీసీ నష్టాలకు [more]

కేసీఆర్ కు వైఎస్ జగన్ లేఖ

19/01/2019,07:29 సా.

అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీ అంశంలో మానవతా దృక్పథంతో ఆలోచించి సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. ఈ మేరకు ఆయన కేసీఆర్ కు లేఖ రాశారు. అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జగన్ కోరారు. [more]

2019లో ఏపీ ప్రజలకు విముక్తి

31/12/2018,03:32 సా.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందుతుందని ఆయన పేర్కొన్నారు. విలువలు లేని అవకాశవాదుల నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలుగుతుందని, కొత్త ఏడాది ఆంధ్రప్రదేశ్ లో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతుందని [more]

1 2 3