వైసీపీ గెలుపు… పండగ చేసుకుంటున్న ఉద్యోగులు

23/05/2019,11:19 ఉద.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం కావడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ ప్రభంజనం వీయడంతో ప్రభుత్వ ఉద్యోగులు బయటకు వచ్చి సంబరాలు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయం బయటకు వచ్చిన ఉద్యోగులు బాణాసంచా [more]

ముందంజలో నారా లోకేష్

23/05/2019,08:46 ఉద.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుంజలో ఉండగా మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం మంత్రి నారా లోకేష్ దూసుకుపోతున్నారు. వైసీపీపై ఆయన లీడ్ లో కొనసాగుతున్నారు. పులివందుల, ఎర్రగొండపాలం, రంపచోడవరం, కడప, కమలాపురం నియోజకవర్గాల్లో వైసీపీ ముందంజలో ఉంది.

ఇద్దరు ఏపీ మంత్రుల వెనుకంజ

23/05/2019,08:39 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 20 నియోజకవర్గాల్లో వైసీపీ ముందుంజలో ఉండగా తెలుగుదేశం పార్టీ ఒక్క నియోజకవర్గంలో కూడా లీడ్ లో లేదు. మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో, నెల్లూరి సిటీ లో మంత్రి నారాయణ వెనుకంజలో [more]

పోస్టల్ బ్యాలట్ ఓట్లలో దూసుకుపోతున్న వైసీపీ

23/05/2019,08:36 ఉద.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. కావలి, శ్రీకాకుళం, నెల్లూరు రూరల్, కొండెపి, నరసన్నపేట, పులివెందుల, ఒంగోలు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు వెలువడిని పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో వైసీపీ [more]

బ్రేకింగ్ : 10 నియోజకవర్గాల్లో వైసీపీ లీడ్

23/05/2019,08:28 ఉద.

పోఃటల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనబరుస్తోంది. 10 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ కంటే ఆధిక్యంలో ఉన్నారు. రాజాం, అరకు, పాలకొండ, అమలాపురం, అనంతపురం అర్బన్, కమలాపురం, పాతపట్నం, పలాస, వినుకొండ, సత్తెనపల్లిలో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ [more]

ఇంటర్ ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

29/04/2019,12:50 సా.

ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అవకతవకలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై ఇవాళ వాదనలు జరిగాయి. ప్రభుత్వం ఇప్పటికే ఈ సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని, ఫెయిలైన అందరు విద్యార్థుల పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ వాల్యువేషన్ జరుపుతున్నట్లు ప్రభుత్వ తరపు లాయర్ కోర్టు దృష్టికి [more]

లక్ష్మణ్ నిరాహార దీక్ష ప్రారంభం

29/04/2019,12:27 సా.

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఆందోళనలు ఉదృతమవుతున్నాయి. ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. పోలీసులు ఎక్కడికక్కడ నిర్భందం విధించి అరెస్టులు చేస్తుండటంతో ఆయన ప్రైవేటు వాహనంలో పార్టీ కార్యాలయానికి చేరుకొని దీక్షను ప్రారంభించారు. ఫలితాల్లో [more]

ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీల నేతలు అరెస్ట్

29/04/2019,12:08 సా.

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ ‘ఇంటర్ బోర్డు ముట్టడి’కి పిలుపునిచ్చిన తెలంగాణ ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఫలితాల్లో అవకతవకల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఫలితాల అవకతవకల వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన [more]

క్రాస్ చెక్ చేసుకోకుండానే ఫలితాల విడుదల

27/04/2019,11:56 ఉద.

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఫలితాల్లో తప్పులు జరగడానికి కారణాలను పరిశీలించిన కమిటీ 15 అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఫలితాల విషయంలో గ్లోబెరినా సంస్థతో పాటు ఇంటర్ బోర్డు కూడా పలు తప్పులు చేసినట్లు కమిటీ [more]

ఎట్టకేలకు కదిలిన ముఖ్యమంత్రి కేసీఆర్

24/04/2019,03:48 సా.

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యల వంటి పరిణామాలపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఇవాళ ఆయన ప్రగతి భవన్ లో ఇంటర్ ఫలితాల వివాదంపై సమీక్ష నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఈ [more]

1 2