Fri May 03 2024 20:50:49 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అరెస్ట్
బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను రద్దు చేయాలంటూ ఆయన దీక్షకు దిగారు
బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను రద్దు చేయాలని కోరుతూ ఆయన దీక్షకు దిగారు. దీక్షకు దిగిన వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు, బీఎస్పీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ప్రవీణ్‌కుమార్ ను వెంటనే విడుదల చేయాలంటూ బీఎస్పీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
గ్రూప్ 1 పరీక్షను....
మరోవైపు బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ ఒక వీడియోను విడుదల చేశారు. ఈ ప్రశ్నాపత్రం లీకేజీలో కేసీఆర్ కుటుంబ సభ్యులున్నారని ఆరోపించారు. 30 లక్షల మంది నిరుద్యోగ యువత పక్షాన తాను దీక్షకు దిగుతుంటే దానిని భగ్నం చేయడానికి పోలీసులు ప్రయత్నించారని, అయినా తన దీక్ష ఆగదని తెలిపారు. గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను కూడా వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story