Wed May 01 2024 12:56:13 GMT+0000 (Coordinated Universal Time)
BRS : బీఆర్ఎస్ కు మరో కీలక నేత గుడ్ బై
ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు
పార్లమెంటు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ను పార్టీ నేతలు వదిలిపెట్టి వెళుతూనే ఉన్నారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన బేతి సుభాష్ రెడ్డి త్వవరలో బీజేపీ పార్టీలో చేరే అవకాశాలున్నాయి. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపారు.
బీజేపీ లో చేరేందుకు....
తనకు గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకుండా కొత్తగా చేరిన బండాలు లక్ష్మారెడ్డికి టిక్కెట్ ఇవ్వడాన్ని ఆయన తప్పుపడుతూ పార్టీ నుంచి తప్పుకున్నారు. అయితే తాను మల్కాజ్గిరిలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో మరో కీలక నేత బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లయింది. ఇలా వరసబెట్టి పార్లమెంటు ఎన్నికల వేళ పార్టీని వీడి వెళుతుండటం పార్టీ అధినేతకు తలనొప్పిగా తయారయింది.
Next Story