జీన్స్ ప్యాంట్లలో డ్రగ్స్ పెట్టి….

డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. అధికారుల కన్నుగప్పి డ్రగ్స్ ను రవాణా చేయడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటోంది. హైదరాబాద్ డ్రగ్స్ స్మగ్లింగ్ కు హబ్ గా మారింది. ఫార్మారంగం హైదరాబాద్ లో విస్తరించి ఉండటంతో డ్రగ్స్ మాఫియా దీనిపై కన్నేసింది. హైదరాబాద్ నుంచి ఇతర దేశాలకు డ్రగ్స్ రవాణా చేసేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటోంది. ఇక్కడి నుంచి పార్సిల్ ద్వారా డ్రగ్స్ ను పంపిస్తున్న ముఠాను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు.

కొరియర్ ఆఫీసులో దాడులు….
కడప జిల్లాలోని పొద్దుటూరు చెందిన మహ్మద్ రఫి కదలికలపై అనుమానం వచ్చింది. మహ్మద్ రఫి కార్గో ద్వారా జీన్స్ ప్యాంట్లను కువైట్ కు పంపుతున్నారు. ఆరు జీన్స్ ప్యాంట్లను కార్గొ ద్వారా కువైట్ కు పార్శిల్ చేశారు. అయితే అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేయగా జీన్స్ ప్యాంట్ల నడుమ భాగంలో ఉన్న పట్టీల్లో డ్రగ్స్ ను దాచిపెట్టి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కొరియర్ కార్యాలయంలోనే ఈ దాడులు జరిగాయి. జీన్స్ ప్యాంట్ లో ప్రత్యేకంగా కుట్టిన భాగంలో మెథో క్విలాన్ అనే మత్తు మందును టాబ్లెట్ ల రూపంలో పెట్టి కువైట్ కు కొరియర్ ద్వారా పంపేందుకు ప్రయత్నించారు. జీన్స్ ప్యాంట్ లో దొరికిన మత్తుమందు విలువ 9.50 లక్షల రూపాయలుగా అధికారులు గుర్తించారు. మహ్మద్ రఫీని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*