
దుర్గగుడిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ఘటనలో ఇద్దరు ఉద్యోగుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దుర్గగుడిలో ఉద్యోగం ఇప్పిస్తామని కోనేరు సందీప్ కుమార్ అనే వ్యక్తి నుంచి రూ.50వేలు తీసుకుని నకిలీ ఇంటర్వ్యూలు నిర్వహించారు. బాధితుడికి ఎంతకు ఉద్యోగం రాకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ కేసులో ఏఈ లక్ష్మణ్‌తో పాటు., జూనియర్ అసిస్టెంట్ వేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగులు మాత్రం పెద్ద వారిని తమను బలి చేశారని ఆరోపిస్తున్నారు. ఈకేసులో అవసరమైతే ఈవో సూర్యకుమారిని కూడా విచారిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులపై 420., 120బి., 468, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Leave a Reply