కళ్యాణ్ నా బ్లడ్ బ్రదర్. కానీ ఇది సందర్భం కాదు
ప్రముఖ తెలుగు తెలివిషన్ ఛానల్ మా టీవీ ఇప్పుడు స్టార్ మా టీవీ గా మారుతున్న తరుణంలో ఆ ఛానల్ కి మీలో ఎవరు కోటీశ్వరుడు షో చేస్తున్న మెగా స్టార్ చిరంజీవి స్టార్ మా టీవీ యాజమాన్య బృందం తో పాటు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో అనేకమంది విలేకరులు పాల్గొని మెగా స్టార్ చిరంజీవి ని అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి హోస్ట్ గా చేయటం పై మెగా స్టార్ స్పందన అడగటం దగ్గర నుంచి అందరూ మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం గురించిన పలు ఆసక్తికర ప్రశ్నలను చిరంజీవికి వేసి జవ్వాబులు రాబట్టారు. ఇంత వరకు ఈ ప్రెస్ మీట్ పర్పస్ సర్వైవ్ అయినప్పటికీ ఈ ప్రశ్నల మధ్యన ఒక విలేకరి అడిగిన ప్రశ్నతో ప్రెస్ మీట్ దారి తప్పింది.
ప్రశ్నించటానికే రాజకీయాలలోకి ప్రవేశించి జనసేన పార్టీ స్థాపించానని చెప్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించాల్సి వస్తే మీరు ఏమని ప్రశ్నిస్తారు అంటూ ఒక విలేకరి చిరంజీవికి వేసిన ప్రశ్నకు సమాధానంగా, "మనం స్టార్ మా టీవీ లో ప్రసారమయ్యే కార్యక్రమం గురించి ప్రస్తావించటానికి కలిసాము. ఇప్పటి వరకు అందరూ అలానే ప్రవర్తించారు కూడా. కానీ మీరు సందర్భానికి తగిన విషయాలు ప్రస్తావించకుండా ఇటువంటి ప్రశ్నలు వేస్తే మనం ఏర్పాటు చేసుకున్న ఈ ప్రెస్ మీట్ దారి తప్పే అవకాశం వుంది. మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పవలసి వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తాను. కానీ అవి ప్రస్తావించటానికి ఇది వేదిక కాదని అనుకుంటున్నాను. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ నా బ్రదర్... బ్లడ్ బ్రదర్." అని గుండెల మీద చేయి వేసుకుని మరీ చెప్పారు మెగా స్టార్ చిరంజీవి.
- Tags
- చిరంజీవి