Fri Apr 19 2024 02:10:57 GMT+0000 (Coordinated Universal Time)
జేసీ అంటే జానీవాకర్ రెడ్డి
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాలుగు పెగ్గులేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతారని.. జేసీ దివాకర్ రెడ్డి కాదు జానీవాకర్ రెడ్డి అని దుయ్యబట్టారు. కులం గురించి ఆయన నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. జేసీ చరిత్ర అంతా దోచుకోవడమేనని ఆరోపించారు. చంద్రబాబు బూట్లునాకే జేసీకి కులాల గురించి మాట్లాడే హక్కు లేదని, మరోసారి ఇలా మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు.
నిన్న జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు. జగన్ ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. అభివృద్ధి కోసం పాటు పడాలని కులం ముసుగులో రాజకీయాలు చేయవద్దని జేసీ జగన్ పై విమర్శ చేశారు. దీనిపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. జేసీ చంద్రబాబు మోచేతి కింద నీళ్లు తాగే వ్యక్తిగా వారు విమర్శించారు.
Next Story