Wed Apr 24 2024 18:02:21 GMT+0000 (Coordinated Universal Time)
ఫరూక్ కు బాబు బంపర్ ఆఫర్
నంద్యాల టీడీపీ నేత ఎన్ఎండీ ఫరూక్ కు ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్ఎండీ ఫరూక్ కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రిని చంద్రబాబును కలిశారు. ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాదు శాసనమండలి ఛైర్మన్ పదవిని కూడా ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపుకోసం పనిచేయాని చంద్రబాబు ఫరూక్ ను కోరారు. మే 27వ తేదీతో ప్రస్తుత శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి పదవీ కాలం ముగియనుంది. దీంతో ఫరూక్ వర్గం ఉత్సాహంతో నంద్యాలకు వెళ్లిపోయింది.
- Tags
- ఫరూక్
Next Story