Fri Mar 29 2024 09:58:29 GMT+0000 (Coordinated Universal Time)
మాయావతి యూ టర్న్
బీఎస్సీ అధినేత్రి మాయావతి మాట తప్పారు. ఎన్డీఏ అభ్యర్ధిగా రామ్ నాధ్ కోవింద్ ను ప్రకటించగానే దళితుడిని ఎంపిక చేయడం గుడ్ చాయిస్ అని మాయావతి పేర్కొన్నారు. అయితే గురువారం విపక్షాలు తమ అభ్యర్థిగా మీరాకుమార్ ను ప్రకటిచండంతో తమ మద్దతు మీరా కుమార్ కేనని ప్రకటించారు. దీంతో మాయావతి మాటతప్పారని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రామ్ నాథ్ కోవింద్ దళితుడు కావడంతో మాయావతి తొలుత మద్దతు ప్రకటించకపోయినా మంచి అభ్యర్థి అని పేర్కొనడంతో మాయావతి ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతిస్తారని అందరూ భావించారు. కాని ఉన్నట్లుండి యూటర్న్ తీసుకున్నారు. మీరా కుమార్ కే తమ మద్దతని ప్రకటించారు. అయితే మాయావతి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతిస్తామని ఎక్కడా చెప్పలేదని, మంచి ఎంపిక అని మాత్రమే కామెంట్ చేశారంటున్నారు బీఎస్పీ నేతలు.
- Tags
- మాయావతి
Next Story