Fri Mar 29 2024 14:18:44 GMT+0000 (Coordinated Universal Time)
రేప్ కేసులో సినీ నిర్మాత
సినిమాల్లో అవకాశమిస్తానని నమ్మించాడు. యువతని నమ్మబలికాడు. ఆరు నెలలపాటు తనతో తిప్పుకుంటూ అత్యాచారం చేశారు. ఓ బాలివుడ్ నిర్మాత దారుణమిది. బాలివుడ్ నిర్మాత కరీం మొరాని ముంబయికి చెందిన ఓ విద్యార్థినికి సినిమాల్లో అవకాశమిస్తానని చెప్పాడు. దీంతో ఆ విద్యార్థిని మొరాని చుట్టూ తిరిగింది. ముంబయి, హైదరాబాద్ లలో తిప్పుతూ ఆరు నెలలపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థినికి మత్తుమందిచ్చి మరీ లొంగ దీసుకున్నాడు.
అయితే ఈ సినీ నిర్మాత నుంచి తప్పించుకున్న విద్యార్థిని హైదరాబాద్ లోని హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. తనను వంచించిన నిర్మాతపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హయత్ నగర్ పోలీసులు మొరానీపై కేసు నమోదు చేశారు. విద్యార్థినిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపారు. మొరానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
- Tags
- సినీ నిర్మాత
Next Story