Fri Mar 29 2024 05:50:03 GMT+0000 (Coordinated Universal Time)
వంద కన్నా విజయమే ముద్దు!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్ ఇంటికి ఓ ప్రత్యేక అతిథి వచ్చాడు. అతనెవరో కాదు బిగ్‌బీకి వీరాభిమాని అయిన వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్. అమితాబ్ అంటే గేల్‌కు ఎంతో ఇష్టం. గురువారం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత్‌తో వెస్టీండీస్ టీ20 మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముంబయి వచ్చిన గేల్ అమితాబ్‌ను కలిశాడు. ‘మీ అతిథ్యం అద్భుతంగా ఉంది.. మీరు పుస్తకాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు’ అంటూ గేల్ సోషల్‌మీడియా ద్వారా అమితాబ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. జమైకా ఆటగాడు గేల్ ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌ను ‘లెజెండ్’గా సంబోధించాడు.ఈ సందర్భంగా అమితాబ్ తనని సెంచరీ చేయమన్నారని, కానీ భారత్ విజయం సాధించాలని కోరుకున్నారని గేల్ పేర్కొన్నాడు. కానీ తనకు మాత్రం వందకన్నా విజయమే ముద్దని గేల్ చెప్పాడు.
Next Story