Fri Apr 26 2024 18:15:11 GMT+0000 (Coordinated Universal Time)
సబర్వాల్ తో రాజమౌళి బాహుబలి-3 తీస్తారా?
టాలివుడ్ ను ఒక ఊపు ఊపుతున్న డ్రగ్స్ దందా పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. టాలివుడ్ దర్శకులను, నటులను విచారించినట్లుగానే స్కూలు విద్యార్థులను కూడా ఎక్సైజ్ పోలీసులు విచారిస్తారా? అని వర్మ సంచలన ట్వీట్ చేశారు. అయితే ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పైన కూడా వర్మ సెటైర్ వేశారు. ప్రస్తుతం మీడియాకు అకున్ సబర్వాల్ అమరేంద్ర బాహుబలిలా కన్పిస్తున్నారని, రాజమౌళి అకున్ సబర్వాల్ తో బాహుబలి-3 తీస్తారేమో అని వర్మ వ్యంగ్యోక్తులు విసిరారు. ఎలాంటి ఆధారాలు లేకుండా టాలివుడ్ ప్రముఖులపై మీడియాకు లీకులివ్వడాన్ని వర్మ తప్పుపట్టారు. వారి కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో అర్థం చేసుకోవాలన్నారు వర్మ. గత కొద్ది రోజులుగా స్పందించని వర్మ ఈరోజు తన ట్వీట్ ద్వారా స్పందించారు.
- Tags
- వర్మ
Next Story