కొత్త పథకం ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం

chandrababu kuppam tour

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ‘అన్నదా సుఖీభవ’ పేరుతో నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఈ పథకానికి రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న ‘రైతుబంధు’ పథకంలాగానే రైతులకు నేరుగా పెట్టుబడిని అందించనున్నారు. ఇవాళ అసెంబ్లీలో యనమల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లోని ముఖ్యాంశాలు.
– బడ్జెట్ అంచనా రూ.2,26,117.53 కోట్లు. గతసారి కన్నా 18.38 శాతం పెరుగుదల
– రెవెన్యూ వ్యయం రూ.1,80,369.33 కోట్లు, ఆర్థిక లోటు అంచనా 32,390.68 కోట్లు
– బీసీ సంక్షేమానికి రూ.8,242.64 కోట్లు కేటాయింపు
– వ్యవసాయార రంగానికి రూ.12,732.97 కోట్లు కేటాయింపు
– నీటి పారుదల శాఖకు రూ.16,852.47 కోట్లు
– నిరుద్యోగ భృతి వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంపు
– పసుపు – కుంకుమ పథకానికి రూ.4 వేల కోట్లు

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*