జగన్ మొండోడు…..కేసీఆర్ పై కసి పెరిగింది

ఆర్టీసీ సమ్మె

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కసి పెరిగిందని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తీరుతామని పేర్నినాని స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నామని, వ్యవస్థలన్నీ ప్రైవేటు పరం మవుతున్న పరిస్థిత్తుల్లో ఏపీలో ఒక కార్పోరేషన్ ను ప్రభుత్వంలో విలీనం చేయడమనేది గొప్ప నిర్ణయమని పేర్నినాని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీలో ఏం జరుగుతుందో ఆరు నెలల్లో చూద్దాం అని చేసిన వ్యాఖ్యలతో మా ప్రభుత్వంలో కసిపెరిగిందన్నారు పేర్నినాని. ఏపీ సీఎం జగన్ ఆలోచన మేరకు ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తామని పేర్నినాని చెప్పారు. ఖచ్చితంగా ఆరు నెలల్లో ఈ ప్రక్రియ నెరవేర్చితీరుతామంటున్నారు మంత్రి పేర్నినాని . విజయవాడలో ఆర్టీసీ ఆసుపత్రిలో వసతి భవనం ప్రారంభోత్సవంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*