ప్రధాని బెంగాల్ పర్యటనలో అపశృతి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. మిడ్నాపూర్ సభలో ప్రధాని ప్రసంగిస్తుండగా ఒక్కసారి గా సభకు వచ్చిన వారిపై ఓ టెంటు కూలింది. దీంతో సుమారు 40 మందికి గాయాలయ్యాయి. ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది, బీజేపీ కార్యకర్తలు గాయపడ్డవారిని ప్రధాని కాన్వాయ్ వెంట ఉండే ఆంబులెన్సులు, కార్లు, మొటర్ సైకిళ్లపై ఆసుపత్రులకు తరలించారు. ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరగడంతో ఆయన తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. పైకి ఎక్కినవారిని కిందకు దిగాలని, ఎవరూ పరిగెత్తవద్దని ప్రధాని మైకులో పదేపదే కోరారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డవారిని పరామర్శించారు. ఈ సందర్భంగా మోడీ భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని సభలోనే ఈ ఘటన జరగడంతో సభ నిర్వాహణలో డొల్లతనం బయటపడింది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*