Fri Apr 26 2024 09:22:35 GMT+0000 (Coordinated Universal Time)
బాబు గోగినేనిపై దేశద్రోహం కేసు..?
ప్రముఖ హేతువాది బాబు గోగినేనిపై హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బాబు గోగినేని హేతువాద సమావేశాల పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం, ఆధార్ వివరాలు తీసుకుని వెబ్ సైట్లలో పెట్టి వ్యక్తిగత స్వచ్ఛను హరించారని, విదేశాల మీద విద్వేషకర వ్యాఖ్యలు చేసి భారత దేశ విదేశాంగ విధానానికి ఆటంకం కలిగించారని, మత విశ్వాసాలను దెబ్బతీశారని పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు బాబు గోగినేనిపై 13 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఇందులో ఆయనపై దేశద్రోహం సెక్షన్ కూడా నమోదు చేశారని తెలుస్తోంది. బాబు గోగినేని ప్రస్తుతం బిగ్ బాస్-2 షోలో ఉన్నారు.
Next Story