
ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం దగ్గరపడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో వైసీపీ నేతల వ్యవహారశైలిపై ఆయన మండిపడ్డారు. రౌడీలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారన్నారు. స్పీకర్ సయితం తనపై పేపర్లు విసురుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇళ్ల స్థలాలకు తాము అడ్డుపడుతున్నామని ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారని, ఇప్పుడెలా ఇచ్చేందుకు సిద్దపడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల సేకరణపై పెద్దయెత్తున అవినీతి జరిగిందని, సీబీఐ విచారణ జరిపితే నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు ప్రకటించారు.
Leave a Reply