బ్రేకింగ్ : పోలీసుల అదుపులో చంద్రబాబు
ఎయిర్ పోర్టు లాంజ్ కు టీడీపీ అధినేత చంద్రబాబును తరలించారు. చంద్రబాబుతో పాటు ముఖ్యనేతలను కూడా ఎయిర్ పోర్ట్ లాంజ్ కు తీసుకు వెళ్లారు. దీంతో చంద్రబాబును [more]
ఎయిర్ పోర్టు లాంజ్ కు టీడీపీ అధినేత చంద్రబాబును తరలించారు. చంద్రబాబుతో పాటు ముఖ్యనేతలను కూడా ఎయిర్ పోర్ట్ లాంజ్ కు తీసుకు వెళ్లారు. దీంతో చంద్రబాబును [more]
ఎయిర్ పోర్టు లాంజ్ కు టీడీపీ అధినేత చంద్రబాబును తరలించారు. చంద్రబాబుతో పాటు ముఖ్యనేతలను కూడా ఎయిర్ పోర్ట్ లాంజ్ కు తీసుకు వెళ్లారు. దీంతో చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రజా సంకల్ప యాత్ర చేయడం కష్టమని, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశముందని పోలీసులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి కార్యక్రమంలోనూ ఇదే పరిస్థితి తలెత్తుతుందని, అందుకే కొద్దిసేపు ఎయిర్ పోర్ట్ లాంజ్ లో వెయిట్ చేయాలని కూడా చంద్రబాబుకు పోలీసులు చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబు ప్రజా సంకల్ప యాత్రతో పాటు కొన్ని ప్రయివేటు కార్యక్రమాల్లో కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే 151 నోటీసు ఇచ్చి చంద్రబాబును ఎయిర్ పోర్ట్ లాంజ్ లోకి తరలించారు. చంద్రబాబును ఆయన వాహనంలోనే ఎయిర్ పోర్ట్ కు లాంజ్ కు తరలించారు. అక్కడి నుంచి అమరావతికి వెనక్కు పంపే అవకాశముందని తెలుస్తోంది.